'కొమరం భీం' తండ్రిగా అజయ్ దేవగణ్.. ఇందులో నిజమెంత..!

ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Ajay Devagan In Komaram Bheem Father Character, Ajay Devagan, Ram Charan, Ntr, R-TeluguStop.com

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఇందులో అజయ్ దేవగణ్ చేసే పాత్రపై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకు వచ్చింది.

ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈయన పాత్రను రాజమౌళి ఎలా ప్రెసెంట్ చేస్తాడో అని టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

Telugu Ajay Devagan, Ajaydevagan, Komaram Bheem, Rajamouli, Ram Charan-Movie

ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కొమరం భీం తండ్రి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో నిజమెంత ఉందొ తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడడంతో ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేసారు.

Telugu Ajay Devagan, Ajaydevagan, Komaram Bheem, Rajamouli, Ram Charan-Movie

ఇప్పటికే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు పాల్గొంటున్నారు.ఇంకా జులై మొదటి వారంలో ఆలియా భట్ కూడా షూట్ లో పాల్గొన బోతుందని తెలుస్తుంది.ఈ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సాంగ్ ను షూట్ చేయబోతున్నారని, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కూడా తీస్తున్నారని తెలుస్తుంది.

ఈ సీన్స్ తర్వాత చరణ్ ఆలియా మీద ఒక రొమాంటిక్ సాంగ్ కూడా చేయబోతున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube