అదుగో పులి సామెత... 'క్రాక్‌' రీమేక్‌ హీరో కూడా ఫిక్స్‌ అయ్యాడట

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పుకార్లు అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.చిన్న పుకారు మొదలు అయితే దాన్ని గురించి పెద్ద పెద్దగా వార్తలు వస్తున్నాయి.

 Ajay Devgn Act In Krack Movie Remake, Krack Movie Remake, Ajay Devgn, Social M-TeluguStop.com

సినిమాకు సంబంధించిన చిన్న విషయాన్ని యూనిట్ సభ్యులు బయటకు చెప్తే దాన్ని కాస్త చిలువలు పలువులు చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రవితేజ నటించిన క్రాక్ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్‌ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.

కేవలం సంక్రాంతి విజేత మాత్రమే కాకుండా ఈ సినిమా కరోనానే జయించింది అంటూ ప్రచారం జరుగుతుంది.ఇలాంటి సినిమా ప్రస్తుతం రీమేక్‌ కు సిద్దం అయ్యిందని అంటున్నారు.

Telugu Ajay Devagan, Ajay Devgn, Krack, Krack Hindi, Ravi Teja, Raviteja, Ravite

ఠాగూర్‌ మధు ఈ సినిమా ను బాలీవుడ్‌ లో రీమేక్‌ చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్‌ లో అజయ్ దేవగన్‌ నటించేందుకు ఒప్పుకున్నాడట.ఈ విషయమై ఇప్పటికే ఆయన తో ఒప్పందం కూడా జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే రీమేక్ కూడా రూపొందబోతుంది.గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గాను అజయ్‌ దేవగన్‌ కు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వార్తలు మరియు పుకార్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఏది అఫిషియల్‌ ఏది ఫేక్‌ అనే విషయం తెలియక జనాలు తికమక పడుతున్నారు.

కాని యూనిట్‌ సభ్యుల నుండి రీమేక్‌ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు జనాలు నమ్మకూడదు అంటూ రవితేజ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube