భారీ అంచనాల నుంచి ఫ్లాప్ దిశగా ఆ మూవీ.. ఇక ఆ డైరెక్టర్ కెరీర్ ఢమాల్..!

Ajay Bhupathy Career Spoiled After One Utterflop

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఫీల్డ్ అన్న సంగతి అందరికీ విదితమే.ఇక్కడ సక్సెస్ ఉన్న వారికి మాత్రమే అవకాశాలు వస్తుంటాయని, ఒకసారి ఫెయిల్యూర్ చవి చూశాడంటే.

 Ajay Bhupathy Career Spoiled After One Utterflop-TeluguStop.com

ఇక వారి సంగతి అంతే.అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చాలా మంది హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఒక్క ఫ్లాప్ తర్వాత కోలుకోలేకపోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డ వారు కూడా ఉన్నారు.ఇప్పుడ ఆ కోవలోకే మరో దర్శకుడు చేరాడనే టాక్ వినబడుతోంది.

 Ajay Bhupathy Career Spoiled After One Utterflop-భారీ అంచనాల నుంచి ఫ్లాప్ దిశగా ఆ మూవీ.. ఇక ఆ డైరెక్టర్ కెరీర్ ఢమాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన ఎవరంటే.

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్నాళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అజయ్ భూపతిఆర్ ఎక్స్ 100 అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.

ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం తన క్రియేటివిటీ అని, మంచి కథ రాశానాని, అది పాన్ ఇండియా ఐడియా అని చెప్పుకొచ్చాడు అజయ్ భూపతి.ఇక ఆ సినిమా ద్వారా హీరో, హీరోయిన్‌తో పాటు డైరెక్టర్‌కూ మంచి పేరొచ్చింది.

అజయ్ భూపతి అయితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు.కాగా నెక్స్ట్ మూవీ ఎవరితో తీస్తాడని అందరూ అనుకున్నారు.

Telugu Ajay Bhupathy, Anil Shunkar, Dhanush, Emotional, Flop, Maha Samudram Movie, Sharwanand, Sidhardh, Tollywood-Latest News - Telugu

ఈ క్రమంలోనే తన క్రియేటివిటీ అంటూ ఓ కథ అల్లుకుని మహాసముద్రంఅనే సినిమా తీశాడు.భావోద్వేగాలతో కూడిన చిత్రమని, కచ్చితమైన లవ్ స్టోరి అని, క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయని వీర లెవల్‌లో ఇంటర్వ్యూల్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అజయ్ భూపతి మాట్లాడాడు.ఇప్పుడు ఆ మాటలే కొంప ముంచినట్లున్నాయని పలవురు అభిప్రాయపడుతున్నారు.భారీ హైప్ క్రియేట్ చేయడం వల్ల సినిమాలో అనుకున్న ఎమోషన్స్ రీచ్ కావడం లేదని టాక్ వినబడుతోంది.

హిట్ వచ్చాక నెక్స్ట్ మూవీ డిఫరెంట్ జోనర్‌లో, స్టోరిపైన కాన్సంట్రేట్ చేయకుండా, ఒకే కథను అటు ఇటు తిప్పాడని విమర్శలు వస్తున్నాయి.

Telugu Ajay Bhupathy, Anil Shunkar, Dhanush, Emotional, Flop, Maha Samudram Movie, Sharwanand, Sidhardh, Tollywood-Latest News - Telugu

ఇకపోతే తన కథను ఒప్పుకోలేదని హీరో రవితేజను అజయ్ భూపతి చీటర్ అని తిట్టాడని వార్తలు కూడా వస్తున్నాయి.మొత్తంగా అజయ్ భూపతి రెండో సినిమా అయిన మహాసముద్రం లో కనీసం అల కూడా ఉప్పొంగలేదని, బాక్సాఫీసు తీరాన్ని కూడా తాకలేదని విమర్శకులు అంటున్నారు.ఈ దెబ్బతో అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా కూడా ఆగిపోయే చాన్సెస్ ఉంటాయని చర్చ నడుస్తున్నది.

ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నెక్స్ట్ మూవీ ధనుష్‌తో ప్లాన్ చేశారని సమాచారం.ఇందుకు సంబంధించిన కథను కూడా ఆల్రెడీ ధనుష్‌కు చెప్పగా, ఆయన మహాసముద్రం’ తర్వాత చూద్దామని చెప్పాడని తెలుస్తోంది.

అలా ఇప్పుడు ధనుష్ సినిమా ఉంటుందా? ఇంతకీ డైరెక్టర్ కెరీర్ ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తంగా అజయ్ కెరీర్ ఢమాల్ అని కూడా చర్చ నడుస్తున్నది.

చూడాలి మరి.ఏమవుతుందో.

#Flop #Sharwanand #Dhanush #Ajay Bhupathy #Sidhardh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube