మహాసముద్రంలో ఈదబోతున్న 'జాను' కపుల్‌  

Ajay Bhupathi Next Movie With Sharva And Samantha-ajaybhupathi Direct Jaanu Movie,samantha In Jannu Movie,sharwanandh And Samantha

తమిళ హిట్‌ మూవీ 96 చిత్రాన్ని తెలుగులో జాను అనే టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.జాను చిత్రంలో హీరోగా శర్వానంద్‌ హీరోయిన్‌గా సమంతలు నటించారు.

Ajay Bhupathi Next Movie With Sharva And Samantha-Ajaybhupathi Direct Jaanu Samantha In Jannu Sharwanandh Samantha

ఈ జంట ఎలా ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం రాకముందే అప్పుడే వీరిద్దరి కాంబోలో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు అజయ్‌ భూపతి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా మళ్లీ కలిసి నటించేందుకు ఓకే చెప్పారు.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా సక్సెస్‌ దక్కించుకున్న అజయ్‌ భూపతి తన తదుపరి చిత్రంగా మహాసముద్రం అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే.

అయితే ఆ సినిమాకు మొదట రవితేజ హీరోగా అనుకున్నాడు.ఆ తర్వాత నాగచైతన్యతో అనుకున్నాడు.చివరకు శర్వానంద్‌తో సినిమాను అజయ్‌ భూపతి ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.శర్వానంద్‌కు జోడీగా సమంతను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.శర్వానంద్‌ కాకుండా నాగచైతన్యతో ఈ సినిమాను అనుకున్న సమయంలో సమంత ఓకే చెప్పింది.ఇప్పుడు నాగచైతన్య నో చెప్పినా సమంత మాత్రం ఓకే అన్నట్లుగానే తెలుస్తోంది.

తాజా వార్తలు

Ajay Bhupathi Next Movie With Sharva And Samantha-ajaybhupathi Direct Jaanu Movie,samantha In Jannu Movie,sharwanandh And Samantha Related....