కోలుకుంటున్న రాజశేఖర్‌  

rajashekhar today health condition Rajashekar, Jivitha, Coronavirus, Apolo Hospitals, Kamineni Family, Rajashekar Latest Health Bulliten, Press Note Release - Telugu Apolo Hospitals, Coronavirus, Jivitha, Kamineni Family, Press Note Release, Rajashekar Latest Health Bulliten, Rajashekhar Today Health Condition Rajashekar

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయన ఇద్దరు కూతుర్లు కూడా ఎలాంటి లక్షణం లేకుండానే కరోనాను జయించారు.

TeluguStop.com - Ajashekar Jivitha Coronavirus

వయసు రీత్యా జీవిత మరియు రాజశేఖర్‌లు కరోనా వల్ల ఇబ్బంది పడ్డారు.వారం పాటు జీవిత కరోనా వల్ల ఇబ్బంది పడ్డా ఆమె ఆ తర్వాత బయట పడింది.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యి ప్రస్తుతం ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నారు.అయితే రాజశేఖర్‌ మాత్రం కరోనా వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

TeluguStop.com - కోలుకుంటున్న రాజశేఖర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఆ విషయాన్ని స్వయంగా ఆసుపత్రి వర్గాలు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసి మరీ తెలియజేశారు.

దసరాకు ముందు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసిన ఆసుపత్రి వర్గాల వారు మళ్లీ అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.కాని ఆసుపత్రి వర్గాలు మాత్రం రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించారు.

ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది.ఆయన మొన్నటితో పోల్చితే ఈజీగానే శ్వాస తీసుకుంటున్నాడు.కరోనా నుండి ఆయన మరికొన్ని రోజుల్లోనే బయట పడే అవకాశం ఉందని వైధ్యులు పేర్కొన్నారు.ఇదే సమయంలో ఆయనకు ఇమ్యూనిటీ పవర్‌ పెంచేందుకు గాను చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులతో ఆయన రెగ్యులర్‌గా మాట్లాడటంతో పాటు ఆసుపత్రిలో టీవీ చూడటం చేస్తున్నాడని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు.ఆయన ఆరోగ్యవంతంగా వారం నుండి పది రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు.

మొత్తానికి రాజశేఖర్‌ ఆరోగ్యం పై వస్తున్న వార్తులు ఆయన సన్నిహితులకు మరియు ఫ్యాన్స్‌ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.సినీ ప్రముఖులు పలువురు ఆయన వెంటనే కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.

చిరంజీవి రాజశేఖర్‌ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చడంతో పాటు అపోలో వైధ్యుల సహకారం కూడా అందించాలంటూ కామినేని ఫ్యామిలీకి విజ్ఞప్తి చేశాడట.

#Kamineni Family #Apolo Hospitals #Jivitha #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ajashekar Jivitha Coronavirus Related Telugu News,Photos/Pics,Images..