అలాంటి సినిమాతో రీ ఎంట్రీకి సిద్దమైన ఐశ్వర్య రాయ్.. కాకపోతే?  

aiswarya rai planning a strong comeback aiswarya rai, Bollywood, ae dil hei mushkinl, mani ratnam, abishek bachhan ,bollywood ,kolywood, - Telugu Ae Dil Hei Mushkinl, Aiswarya Rai, Bollywood, Mani Ratnam

ప్రముఖ భారతీయ నటి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారెవ్వరు లేరు.తన నటన తో ఎంతో పేరు సంపాదించుకుంది.1994 లో ప్రపంచ సుందరి గా గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా కొన్ని యాడ్ లలో కూడా నట‌ించింది‌.

TeluguStop.com - Aiswarya Rai Planning A Strong Comeback

తన నటనతో సినిమాల్లో మంచి గుర్తింపు ఐశ్వర్యరాయ్ ఎన్నో సినీ పురస్కారాలు కూడా అందుకుంది.ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ తర్వాత సినిమాలలో అడుగు పెట్టింది.

1997 తమిళ సినిమాలో తొలిసారిగా పరిచయం అయింది.ఆ తర్వాత హిందీలో ఓ సినిమాలో నటించి బాలీవుడ్ కు పరిచయమైంది.

TeluguStop.com - అలాంటి సినిమాతో రీ ఎంట్రీకి సిద్దమైన ఐశ్వర్య రాయ్.. కాకపోతే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత వరుస సినిమాల్లో పలు భాషల్లో నటించిన ఐశ్వర్యరాయ్ 2007 లో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్రచార కర్తగా వ్యవహరించారు.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా నిలిచి మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య.

5 సంవత్సరాల క్రితం రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో నటించింది.ఇక ఆ తర్వాత ఇంతవరకు ఏ సినిమాల్లో నటించని ఐశ్వర్యరాయ్ తాజాగా ఓ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మణిరత్నం దర్శకత్వం లో పొన్నియన్ సెల్వన్ సినిమాలో చేయనుందట.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ రెండు పాత్రల్లో నటించనుంది.అందులో మందాకిని దేవి, నందిని పాత్రలుగా పేర్లు వినిపిస్తున్నాయి.

ఇందులో పాజిటివ్, నెగటివ్ పాత్రలో కనిపించనుంది.ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

అంతేకాకుండా చియాన్ విక్రమ్, జయమ్ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఐశ్వర్యరాయ్ మళ్లీ తన నటనతో అభిమానులను మెప్పించనుంది.

#Mani Ratnam #Aiswarya Rai #AeDil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు