పిల్లలు నాకే కావాలంటూ ధనుష్ కు భారీ షాకిచ్చిన ఐశ్వర్య.. ఆయన అంగీకరిస్తారా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth-Dhanush ) ల గురించి మనందరికీ తెలిసిందే.

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లయి 18 ఏళ్లకు పైగా కలిసి ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.గత రెండేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.

తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది.

దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈ జంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు.విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు.

Advertisement

హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు.ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య.

అయితే పిల్లల బాధ్యత పై ఇద్దరూ ఒక క్లారిటీతో ఉన్నారట.ఈ క్రమంలోనే ఐశ్వర్య తనకు పిల్లల బాధ్యతను అప్పగించాలని కోరిందట.దానికి ధనుష్ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది.

ఐశ్వర్య రజనీకాంత్ చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు.ఐశ్వర్య తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 3 మూవీలో ధనుష్ హీరోగా నటించాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఈ దంపతులకు యాత్ర, లింగ( Yatra , Linga ) అనే పిల్లలు ఉన్నారు.మొదటి కొడుకు యాత్రకు 18 ఏళ్లు.

Advertisement

ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఇంకా వెల్లడించలేదు.ఐశ్వర్య సినిమా డైరెక్షన్‌లో బిజీగా ఉంది.

నటుడు ధనుష్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.తెలుగు, తమిళ్ , హిందీ బాషాలతో పాటు హాలీవుడ్ లోనూ నటించారు ధనుష్.

మరి పిల్లల విషయంలో ధనుష్ ఐశ్వర్యలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

తాజా వార్తలు