వామ్మో.. ఏకంగా 400 మందితో ఐశ్వర్య సాంగ్.. మాములుగా లేదుగా!

సాధారణంగా ఒక పాటను చిత్రీకరించాలంటే ఆ పాట కోసం కొందరు ఆర్టిస్టులను ఉపయోగించడం సర్వసాధారణమే.అయితే పాట చిత్రీకరణలో భాగంగా కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఆర్టిస్టులను ఉపయోగించడం మనం చూస్తున్నాము.

 Aishwarya Song With 400 People At Once-TeluguStop.com

కానీ ఒక్క పాట కోసం వందల మందితో పాట చిత్రీకరణ చేయాలంటే ఎంతో కష్టమైన పనని చెప్పవచ్చు.తాజాగా ఇలాంటి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు నేషనల్ అవార్డ్ విన్నర్, కొరియోగ్రాఫర్ బృందా గోపాల్.

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ‘పొన్నియిన్ సెల్వన్‘ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ ఎపిక్ పిక్చర్ షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ఓ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.

 Aishwarya Song With 400 People At Once-వామ్మో.. ఏకంగా 400 మందితో ఐశ్వర్య సాంగ్.. మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ లో భాగంగా ఐశ్వర్య రాయ్ ఓ పాట చిత్రీకరణ చేయనున్నారు.

ఈ పాట చిత్రీకరణలో భాగంగా ఈ పాటకు గోపాల్ బృందా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Telugu 400 People, Aishwarya, Aishwarya Rai Ponnian Selvan Movie, Aishwarya Rai Song, Bollywood, Choreographer Brunda Gopal, Heroine, Song-Movie

అయితే ఈ పాటకు ఏకంగా 400ల మంది జూనియర్ ఆర్టిస్టులు పని చేయనున్నట్లు తెలుస్తోంది.ఇంత మంది ఆర్టిస్టుల సమక్షంలో తెరకెక్కుతున్న ఈ పాట యూనిక్ అండ్ ది బెస్ట్ సాంగ్ గా ఉండబోతోందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు ‘పద్మన్’, ‘దబాంగ్ 3’ వంటి సినిమాల షూటింగులు కూడా అక్కడే షూటింగ్ జరుపుకోవడం విశేషం.

#Aishwarya #Aishwarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు