మిస్ ఇండియా పోటీలలో పాల్గొని సివిల్స్ సాధించిన మోడల్… సోషల్ మీడియాలో వైరల్  

Former Miss India finalist clears UPSC Civil Service Exam, Aishwarya Sheoran, Miss India, Modeling, Civil Service - Telugu Aishwarya Sheoran, Civil Service, Former Miss India Finalist Clears Upsc Civil Service Exam, Miss India, Modeling

అందం ఉన్నచోట చదువు ఉండదు.చదువు ఉన్నచోట అందం ఉండదు అని చాలా మంది చెబుతూ ఉంటారు.

 Aishwarya Sheoran Miss India Modeling Civil Service

అయితే కొంత మంది ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులని చూస్తూ ఉంటే అందంతో పాటు తెలివి వాళ్ళకి ఉన్న రెండు ఆభరణాలు అనిపించక మానదు.అలాంటి వారిలో ఆమ్రపాలి, స్మిత సబర్వాల్ లాంటి మహిళా ఉన్నతాధికారిణిల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

వీళ్ళు మాత్రమే కాకుండా ఇలాంటి అందాల అధికారిణిలు చాలా మంది మనకి కనిపిస్తారు.అయితే మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే ఫైనల్స్ వరకు వెళ్లి మోడలింగ్ లో రాణిస్తున్న ఓ అమ్మాయి సివిల్స్ లో విజేతగా నిలవడం అంటే కొద్దిగా ఆశ్చర్యంగానే చెప్పాలి.

మిస్ ఇండియా పోటీలలో పాల్గొని సివిల్స్ సాధించిన మోడల్… సోషల్ మీడియాలో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఓ మోడల్ మిస్ ఇండియా పోటీలలో పాల్గొని అటు తల్లి కోరికని తీర్చేసి సివిల్స్ లో ర్యాంక్ సొంతం చేసుకొని తన కోరికని నెరవేర్చుకుంది.

ఆమె పేరు ఐశ్వర్య షియోరన్.

అందాల పోటీలలో పాల్గొని మాజీ మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ అయ్యింది.తాజాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్–2019లో అర్హత సాధించింది.

ఈ సంద‌ర్భంగా ఐశ్వ‌ర్య మాట్లాడుతూ నేను మిస్ ఇండియా కావాల‌న్న‌దే మా అమ్మ‌ కోరిక.మా అమ్మ‌కి ఐశ్వ‌ర్యారాయ్ అంటే చాలా ఇష్టం.

ఆ కోరిక తోనే నాకు ఐశ్వ‌ర్య అని పేరుపెట్టింది.నేను మిస్ ఇండియా టాప్ 21 ఫైన‌ల్ లిస్ట్ లు ఎంపిక‌య్యాను.

నాకు సివిల్ స‌ర్వీస్ అంటే చాలా ఇష్టం.ఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో ఫ్రెష్ ఫేస్‌ అవార్డు నెగ్గి ఆపై మోడలింగ్ కెరీర్ ని ఐశ్వర్య ప్రారంభించింది.

మోడలింగ్ చేస్తూనే సివిల్స్ కి కూడా ఆమె ప్రిపేర్ అయ్యింది.ఇటీవ‌ల విడుద‌లైన యూపీఎస్సీ స‌ర్వీస్ ఫ‌లితాల్లో ఈమెకి 93వ ర్యాంక్ సాధించింది.

ఓ వైపు మోడలింగ్ లో రాణిస్తూ కూడా సివిల్స్ లో సక్సెస్ అవ్వడం ద్వారా తన కోరికని నెరవేర్చుకున్న ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

#Modeling #FormerMiss #Civil Service #Miss India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aishwarya Sheoran Miss India Modeling Civil Service Related Telugu News,Photos/Pics,Images..