ఆ విషయంలో రౌడీనే తోపు అంటున్న బ్యూటీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.ప్రేమికుల రోజున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 Aishwarya Rajesh Vijay Devarakonda-TeluguStop.com

విజయ్ సరికొత్త పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్, విజయ్ దేవరకొండ ప్రవర్తనపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఇటీవల తెలుగులో కౌసల్యా కృష్ణమూరి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, విజయ్ దేవరకొండ నటనకు బాగా ఇంప్రెస్ అయ్యిందట.ఆయన సెట్స్‌పై తోటి ఆర్టిస్టులతో ప్రవర్తించే తీరును చాలా బాగుంటుందని ఆమె విజయ్‌ను ఆకాశానికెత్తింది.

ఏదేమైనా విజయ్ సరసన హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్, ఈ సినిమాలో ఓ ఇల్లాలి పాత్రలో నటిస్తోంది.ఈ సినిమా తన కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా మిగతా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube