అభిమానికి క్లాస్‌ పీకి నెటిజన్స్‌ ప్రశంసలు అందుకున్న హీరోయిన్‌

స్టార్‌ హీరోలకు హీరోయిన్స్‌ అభిమానులు మరీ పిచెక్కి ఉంటారు.కొందరు అభిమానులు అయితే చావడానికి అయినా చంపడానికి అయినా సిద్దం అన్నట్లుగా ఉంటారు.

 Aishwarya Rajesh Serious On Netizen , Aishwarya Rajesh, Vijay Devarakonda, World-TeluguStop.com

ఇటీవల హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ కు సోషల్‌ మీడియా ద్వారా ఒక అభిమాని కామెంట్‌ పెట్టాడు.ఏమని అంటే మేడం మీరు అంటే నాకు చాలా ఇష్టం.

మీ నటన అంటే నాకు ప్రాణం.మీ కోసం నేను చావడానికి కూడా సిద్దం అంటూ ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు చాలా ఘాటుగా కామెంట్‌ పెట్టాడు.

ఆ అభిమాని కామెంట్‌కు ఐశ్వర్య స్పందించింది.జీవితం అనేది అర్థాంతరంగా చావడానికి కాదు.మీరు ఎందుకు నా కోసం ప్రాణాలు ఇస్తానంటున్నారు అంటూ అభిమానికి క్లాస్‌ పీకింది.నన్ను అభిమానిస్తే అభిమానించండి.

అంతే తప్ప ప్రాణాలైనా ఇస్తానంటే ఎలా అంటూ సీరియస్‌ అవ్వడంతో నెటిజన్స్‌ ఐశ్వర్య రాజేష్‌ సమయస్ఫూర్తిని అభినందించారు. అంతా కూడా ఈ విషయంలో ఐశ్వర్య రాజేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

Telugu Kausalyakrishna, Netizens, Tollywood, Lover-Movie

తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి మరియు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాలతో మెప్పించిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తుంది.ఆ సినిమాలు కాకుండా మరికొన్ని చర్చల దశలో కూడా ఉన్నాయి.తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో బాగా పాపులర్‌ అయిన ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో కూడా స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube