రానాకి నో చెప్పిన హీరోయిన్.. ఎవరంటే?

తెలుగు సినీ నటుడు రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.తన పెళ్లి తర్వాత ఆయన మంచి సినిమా అవకాశం సొంతం చేసుకోగా ప్రస్తుతం ఓ సినిమాలో హీరో పాత్ర కు సమానంగా ఉండే పాత్రలో నటిస్తున్నాడు.

 Aishwarya Rajesh Rejects Rana Movie Rana, Aishwarya Rajesh, Rejects, Movie ,toll-TeluguStop.com

ఇంతకీ ఈ సినిమాలో స్టార్ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.కానీ ఈ సినిమాలో రానా కు ఓ యువ హీరోయిన్ నో చెప్పిందట.

ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ను అందిస్తుంది.

ఇక ఈ సినిమాను సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కు రానా పాత్ర సరిసమానంగా ఉండేలా నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉంది.రానా పాత్ర కోసం కొన్ని ఏర్పాట్లను భారీగానే చేస్తున్నారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు.

Telugu Rana-Movie

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొన్ని అడ్డంకులు వచ్చినాయి.ఇందులో ఇప్పటికీ ఏ హీరోయిన్ నటిస్తోందని వార్తలు రాగా మొదట్లో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి ని ఎంచుకున్నారని తెలిసింది.కానీ ఆమె ఈ సినిమాను కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఆ తర్వాత మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించగా ఈమె కూడా నో చెప్పేసిందట.ఇక ఈ హీరోయిన్ నో చెప్పడానికి కారణాలు తెలియక పోగా ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

ఇక ఏమీ చేయలేక మరో హీరోయిన్ ను వెతుకుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదే కాకుండా రానా ప్రస్తుతం వేణు దర్శకత్వంలో విరాటపర్వం సినిమాల్లో ప్రభు దర్శకత్వంలో అరణ్య సినిమాలో బిజీగా ఉన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube