ఓల్డ్ క్లాసిక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్

కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.అక్కడ స్టార్ హీరోలతో కూడా జతకడుతున్న ఈ అమ్మడు మరో వైపు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది.

 Aishwarya Rajesh In Mundhanai Mudichu Remake, Kollywood, K Bhagyaraja, Sasi Kuma-TeluguStop.com

తెలుగులో ఇంకా సరైన బ్రేక్ రాకపోయినా కూడా తమిళ ప్రజలు మాత్రం ఐశ్వర్య రాజేష్ ని బాగా ఆదరిస్తున్నారు.అక్కడి దర్శకులకి కూడా ఈ అమ్మడు మెయిన్ ఫోకస్ అవుతుంది.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న టక్‌ జగదీష్ లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఓ తమిళ సెన్సేషనల్‌ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

‌ కె.భాగ్యరాజా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ముందానై ముడిచ్చు అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో తెలుగులో మూడు ముళ్లు పేరుతో రీమేక్‌ కూడా చేశారు.
37 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు.కోలీవుడ్ లో విభిన్న చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన శశికుమార్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించబోతున్నారు.రీమేక్‌ కి కథకి ఒరిజినల్ దర్శకుడైన కె.భాగ్యరాజా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం.ముందానై ముడిచ్చు రీమేక్‌లో నటిస్తుండటం తనకెంతో ఎగ్జయిటింగ్‌గా ఉందని, ఓ ల్యాండ్‌ మార్క్‌ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్యారాజేశ్ ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది.మొత్తానికి తమిళంలో ఐశ్వర్య రాజేష్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆమె స్టార్ హీరోయిన్ గా కోలీవుడ్ లో నయనతార తర్వాత ఆ చైర్ లోకి వచ్చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

ఏది ఏమైనా తెలుగు దర్శకులు గుర్తించని ఓ తెలుగమ్మాయి తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదగడం నిజంగా గొప్ప విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube