తెలుగు ప్రేక్షకులపై ఐశ్వర్యా రాజేష్ హాట్ కామెంట్స్.. ఏం చేసిందంటే?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్,ఐశ్వర్య రాజేష్ జంటగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్.ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.

 Aishwarya Rajesh About Sai Dharam Tej In Republic Pre Release Event-TeluguStop.com

ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది.ప్రస్తుతం సాయిధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితి బాలేనందు వల్ల ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి వారు అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ మరియు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

 Aishwarya Rajesh About Sai Dharam Tej In Republic Pre Release Event-తెలుగు ప్రేక్షకులపై ఐశ్వర్యా రాజేష్ హాట్ కామెంట్స్.. ఏం చేసిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడారు.

వేదికపై ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సాయి ధరంతేజ్ తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు.సాయి తేజ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.ప్రస్తుతం ఈ వేదికపై తను లేకపోవడం కొంతవరకు బాధగా అనిపిస్తున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ తెలియజేశారు.

ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఎదురు చూస్తున్నానని అందరిలాగే థియేటర్లో విజిల్స్ వేస్తూ సినిమా చూడాలని ఉందని తెలిపారు.తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరెక్కడా లేవంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తెలియజేశారు.

#Sai Dharam Tej #Pawan Kalyan #Republic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు