ఒక్క డైలాగ్ చెప్పడానికి ఐశ్వర్యా రాయ్ 19 టేకులు.. ఏమైందంటే..?

సాధారణంగా స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు ఎక్కువ టేకులు తీసుకోకుండానే సీన్ ను పూర్తి చేస్తారు.మరీ క్లిష్టమైన సన్నివేశం అయితే మాత్రమే ఎక్కువ టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 Aishwarya Rai Took 19 Takes For A Dialogue With Aamir Khan-TeluguStop.com

అయితే సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ మాత్రం ఒక్క డైలాగ్ చెప్పడానికి ఏకంగా 19 టేకులు తీసుకున్నారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఐశ్వర్యా రాయ్ అమీర్ ఖాన్ తో డైలాగులు చెప్పడానికి ఇన్ని టేకులు తీసుకున్నారు.

1994 సంవత్సరంలో విశ్వ సుందరిగా ఎంపికైన ఐశ్వర్యా రాయ్ తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసిన ఐశ్వర్య ఇద్దరు సినిమాతో తెరంగేట్రం చేసి జీన్స్ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు.

 Aishwarya Rai Took 19 Takes For A Dialogue With Aamir Khan-ఒక్క డైలాగ్ చెప్పడానికి ఐశ్వర్యా రాయ్ 19 టేకులు.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు.

Telugu 19 Takes, Aamir Khan, Abhishek Bachchan, Aiswarya Rai, Bollywood, Hai Iam Sanju Dialogue, Movie Offers, Pepsi Ad, Salman Khan Dating-Movie

కెరీర్ తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ తో డేటింగ్ ద్వారా వార్తల్లో నిలిచిన ఐశ్వర్యా రాయ్ కొన్ని కారణాల వల్ల సల్మాన్ తో విడిపోయారు.ఐశ్వర్య కెరీర్ తొలినాళ్లలో ఒక టాల్కమ్ పౌడర్ యాడ్ లో నటించగా తర్వాత పెప్సీ యాడ్ లో నటించారు.అయితే పెప్సీ యాడ్ లో హాయ్.ఐయామ్ సంజూ అనే డైలాగ్ ను చెప్పడానికి ఐశ్వర్యా రాయ్ ఎంతో కషపడ్డారు.19 టేకుల తర్వాత ఆ షాట్ ఓకే అయింది.ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలోనే ఐశ్వర్యకు మోడల్ గా ఛాన్స్ వచ్చింది.

Telugu 19 Takes, Aamir Khan, Abhishek Bachchan, Aiswarya Rai, Bollywood, Hai Iam Sanju Dialogue, Movie Offers, Pepsi Ad, Salman Khan Dating-Movie

కెరీర్ తొలినాళ్లలో మోడల్ గా చేయడం కొరకు సంకోచించిన ఐశ్వర్య ప్రొఫెసర్ సూచనలు విని యాడ్ లో నటించడానికి ఓకే చెప్పారు.ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ సినిమా ఆఫర్లతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

#Aiswarya #Pepsi #Offers #Salman Khan #Aamir Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు