మోహన్‌బాబు, ఐశ్వర్య రాయ్‌ జోడీ ఏంటీ మణిజీ?  

Aishwarya Rai To Play Negative Role In Mani Ratnam Movie-

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన మోహన్‌బాబు నటనకు మెల్ల మెల్లగా దూరం అవుతున్నాడు.ఆయనకు నటించాలనే ఆసక్తి ఉన్నా కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు.ఎట్టకేలకు ఆయనకు మణిరత్నం నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది.మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.మోహన్‌బాబు మాత్రమే కాకుండా ఇంకా పలువురు స్టార్స్‌ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారు.

Aishwarya Rai To Play Negative Role In Mani Ratnam Movie--Aishwarya Rai To Play Negative Role In Mani Ratnam Movie-

పెద్ద ఎత్తున ఈ చిత్రంలో స్టార్స్‌ కనిపించబోతున్న నేపథ్యంలో తమిళ సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది.

Aishwarya Rai To Play Negative Role In Mani Ratnam Movie--Aishwarya Rai To Play Negative Role In Mani Ratnam Movie-

‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.ఆమె మణిరత్నంపై ఉన్న అభిమానంతో ఏ పాత్రను అయినా చేసేందుకు ఓకే చెప్పిందట.

మణిరత్నం ఆమె కోసం ఒక పవర్‌ ఫుల్‌ విలన్‌ రోల్‌ను సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన లైన్‌ కూడా ఆమెకు ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇక ఇదే సమయంలో తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మోహన్‌ బాబు భార్యగా ఐశ్వర్య రాయ్‌ కనిపించబోతుందట.

వినేందుకు ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం అంటూ చెబుతున్నారు.రాజ్య కాంక్ష, మరియు శత్రువుల నుండి తన రాజ్యంను కాపాడుకునే ఒక విలన్‌ రాణి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతుందట.తనకు అడ్డు వచ్చిన భర్తను సైతం తుదముట్టించేందుకు సిద్దపడే పాత్రలో ఐశ్వర్య కనిపించబోతుందట.

ఇంతటి పవర్‌ ఫుల్‌ పాత్రకు భర్త కూడా కాస్త పవర్‌ ఫుల్‌గానే ఉంటాడని తెలుస్తోంది.అందుకే మోహన్‌బాబు ను ఆ పాత్రకు ఎంపిక చేశారట.మొత్తానికి మోహన్‌ బాబు ఐశ్వర్య రాయ్‌ ల కాంబోను మనం త్వరలో వెండి తెరపై చూడబోతున్నామన్నమాట.