టిక్ టాక్ ఐశ్వర్యరాయ్ కి హీరోయిన్ గా అవకాశం

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు.అలాగే సెలబ్రిటీలన పోలిన వారు కూడా ఉంటారు.

 Aishwarya Rai Tiktok Doppelganger Bags A Film Offer, Malayalam, South Cinema, To-TeluguStop.com

గతంలో ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న స్నేహా ఉల్లాల్ ని సల్మాన్ ఖాన్ హీరోయిన్ గా పరిచయం చేశాడు.అలాగే కత్రినా పోలికలతో ఉన్న జరీన్ ఖాన్ ని పరిచయం చేశాడు.

ఈ ఇద్దరు హీరోయిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.అయితే టిక్ టాక్ వచ్చిన తర్వాత డూప్లికేట్ గాళ్ళు హడావిడి ఎక్కువ అయిపొయింది.

టాలీవుడ్ హీరోలని పోలిన కొంత మంచి కుర్రాళ్ళు స్టార్ హీరోల సినిమాలకి సంబందించిన వీడియోలతో టిక్ టాక్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు.అలాగే కొంత మంది హీరోయిన్స్ లని పోలిన అమ్మాయిలు కూడా మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు.

అలాగే టిక్ టాక్ లో ఈ మధ్య కాలంలో ఐశ్వర్యరాయ్ పోలికలతో అచ్చంగా అలానే ఉన్న అమృత అనే అమ్మాయికి విపరీతంగా ఫలోవర్స్ ఉన్నారు.

కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మలో ఐశ్వర్య పోలికలు ఎక్కువగా కనిపించడంతో ఆమెకి సంబందించిన వీడియోలతో టిక్ టాక్ లు చేస్తూ ఫమౌ అయిపొయింది.

అలాగే గతంలో ఐశ్వర్య నటించిన దక్షిణాది సినిమాలలోని పాటల్ని, సీన్స్ నీ అనుకరిస్తూ ఈ అమ్మడు వీడియోలు తీసుకుని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తుంటుంది.ఇప్పుడు ఆ పోలికలే అమృతకు సినిమాలలో హీరోయిన్ ఆఫర్ తీసుకొచ్చింది.

గతంలో గద్ధలకొండ గణేష్ సినిమాలో కూడా టిక్ టాక్ స్టార్ ని హరీష్ శంకర్ హీరోయిన్ గా పరిచయం చేశాడు.ఇప్పుడు సునీల్ అనే దర్శకుడు పికాసో అనే సినిమాలో జూనియర్ అశ్వర్య అయిన అమృతని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు.

మరి ఐశ్వర్య రేంజ్ లో ఈ అమ్మడు కూడా తన పాపులారిటీ పెంచుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube