చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో కనిపించబోతున్న విశ్వ సుందరి  

చిరంజీవితో జోడీ కట్టబోతున్న ఐశ్వర్య రాయ్. .

Aishwarya Rai Romance With Megastar Chiranjeevi-director Koratala Shiva,megastar Chiranjeevi,telugu Cinema,tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే..

చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో కనిపించబోతున్న విశ్వ సుందరి-Aishwarya Rai Romance With Megastar Chiranjeevi

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యి సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇక ఇందులో మెగాస్టార్ కి జోడీగా హీరోయిన్ పాత్ర కోసం కొరటాల చాలా కాలంగా వేట సాగిస్తున్నాడు. అయితే ఒకపట్టాన ఎవరిని ఫైనల్ చేయలేదు.

అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాపిక్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒకప్పటి విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో పాత్ర ప్రాధాన్యత, అలాగే మెగాస్టార్ కి సరిపోయే జోడీ అంటే కచ్చితంగా కాస్తా సీనియర్ హీరోయిన్ ఉండాలని భావించి చాలా మందిని చూసిన తర్వాత ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఆమెని ఒప్పించడం కోసం బిగ్ బి అమితాబచ్చన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

అన్ని కుదిరితే త్వరలో అఫీషియల్ గా ఆమె పేరు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఐశ్వర్య రాయ్ తెలుగులో నటిస్తే ఆమె ఫుల్ లెంత్ పాత్రలో నటించే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. గతంలో నాగార్జున ఆకాశవీధిలో సినిమాలో ఐశ్వర్య రాయ్ ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే చేసింది.

మరి టాలీవుడ్ లో ఇప్పటికైనా ఈ భామని చూస్తామో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.