ప్లాప్‌లో ఉందని ఐశ్వర్య రాయ్‌ని వద్దనుకున్నారు.. ఎవరికి అందని స్థాయికి చేరి షాక్ ఇచ్చింది..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.ఎంతో స్టార్ స్టేటస్ లో ఉన్న సెలబ్రిటీలు ఎలాంటి అవకాశాలు లేక ఎంతో దీన పరిస్థితులలో మరణించిన వారి గురించి మనం వినే ఉంటాం.

 Aishwarya Rai Missed Preminchukundam Raa Movie Chance-TeluguStop.com

అదేవిధంగా వరుస ఫ్లాపులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సెలబ్రెటీలు రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకొని కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకున్న వారిని కూడా మనం చూస్తున్నాము.ఇలాంటి కోవకు చెందిన వారే బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్.

సినిమా ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తెలుగులో పలు డబ్ సినిమాలలో నటించింది కానీ, ఒక్కటి కూడా పరిపూర్ణంగా తెలుగు సినిమాలలో నటించకపోవడం గమనార్హం.

 Aishwarya Rai Missed Preminchukundam Raa Movie Chance-ప్లాప్‌లో ఉందని ఐశ్వర్య రాయ్‌ని వద్దనుకున్నారు.. ఎవరికి అందని స్థాయికి చేరి షాక్ ఇచ్చింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలామంది దర్శక నిర్మాతలు వారి కథను సిద్ధం చేసుకున్నప్పుడు ఒక హీరో హీరోయిన్ల దృష్టిలో ఉంచుకుని కథను తయారు చేసుకుంటారు.ఈ క్రమంలోనే కథ మొత్తం సిద్ధమైన తర్వాత సదరు హీరోహీరోయిన్ల దగ్గరికి వెళ్లి ప్రస్తావించగా కొందరు సినిమాలకు ఓకే చెబుతారు మరి కొందరు ఆ సినిమాలకు నో చెబుతారు.

ఈ విధంగా ఐశ్వర్యను తెలుగులో ఓ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు.దర్శకుడు జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా అంజలి జవేరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమించుకుందాం రా…నిజానికి మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించాల్సి ఉంది ఐశ్వర్య రాయ్.అయితే అప్పటికే ఈమె వరుస ఫ్లాపులతో ఉండటం వల్ల ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం కోసం దర్శకుడు వెనకడుగు వేశారు.ఇలా ఈమె వరుస ఫ్లాపులలో ఉందన్న ఉద్దేశంతో ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాకి వద్దనుకున్నారు.

ఇలా ఐశ్వర్య మిస్ అయి అంజలా జవేరి ఆస్థానంలో నటించారు.

ఈ విధంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఐశ్వర్యారాయ్ కి వరుసగా రెండు మూడు చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఎదిగిపోయారు అప్పటినుంచి ఐశ్వర్యరాయ్ వెనుతిరిగి చూసుకోలేదు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఐశ్వర్యారాయ్ మరొక తెలుగు చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

జయంత్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రావోయి చందమామ… ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నటించడం కోసం బాలీవుడ్ హీరోయిన్ అన్వేషణలో ఉన్నారు.అందుకోసమే ముంబైకి వెళ్లిన జయంత్ కి అక్కడ ఐశ్వర్యరాయ్ ఎదురుపడ్డారు.నిజానికి ఈ సినిమాలోని ప్రత్యేక పాటలో నటించడం కోసం దర్శకుడు ప్రీతిజింతా కోసం ముంబై వెళ్తే ఐశ్వర్య తారసపడింది.

ఈ క్రమంలోనే ఐశ్వర్య మీ సినిమాలో నటించడం కోసం అందరికీ అవకాశం ఇస్తారు.నాకు ఎందుకు ఇవ్వరని అడగడంతో.

రావోయి చందమామ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించే అవకాశాన్ని అలా ఐశ్వర్యరాయ్ కి వచ్చింది అతని దర్శకత్వంలో సినిమా మిస్ అయినప్పటికీ రావోయి చందమామ సినిమాలో ప్రత్యేక పాటలో నటించి ఐశ్వర్యరాయ్ అందరిని మెప్పించారు.

#AishwaryaRai #AishwaryaRai #AishwaryaRai #Aishwarya #AishwaryaRai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు