రాధేశ్యామ్ లో ఐటెం సాంగ్ చేయనున్న ఐశ్వర్య...?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది.ఇది పీరియాడికల్ నేపధ్యంలో ఉండే ప్రేమకథా చిత్రం.

 Aishwarya Rai Item Song For Radhe Shyam Movie, Darling Prabhas, Director Radhakr-TeluguStop.com

ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.పారిస్ నేపధ్యంలో చిత్ర కథ నడుస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.మిగిలిన మొత్తం హైదేరాబద్ లో ప్రత్యేకమైన ఫారిన్ సెట్ వేసి షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

సినిమాలో ప్రభాస్ తల్లిగా ఒకప్పటి క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తుంది.ఇక ఈ సినిమాలో సాంగ్స్ చిత్రీకరణ కూడా మిగిలి ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

రాధేశ్యామ్ సినిమాలో ఓ ప్రత్యేకమైన గీతంలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నర్థించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సాంగ్ కోసం ఆమెకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది.పాత ఐటెం సాంగ్ తరహాలో కాకుండా చాలా స్పెషల్ గా ఉంటుందని, పాతకాలం సాంగ్స్ తరహాలో చాలా ట్రెడిషనల్ గా డాన్స్ బేస్ చేసుకొని ఉంటుందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సాంగ్ చేయడానికి ఆమె కూడా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది.గతంలో నాగార్జున సినిమాలో ఐశ్వర్య రాయ్ ఓ ఐటెం సాంగ్ చేసింది.తరువాత తెలుగు సినిమా వైపు చూడలేదు.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఆమె ఐటెం సాంగ్ చేయడానికి ఒకే చెప్పినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube