ఐశ్వర్య కూతురు డ్యాన్స్ ఎలా చేసిందో చూశారా?

చాలామంది నటీనటులు తమ జీవితంలో తమ కుటుంబాలకు ఎంతో విలువ ఇస్తారు.ఇక తమ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Aishwarya Rai Daughter Aaradhya Bachchan Dancing With Parents Video Goes Viral,-TeluguStop.com

టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా తమ భార్యా పిల్లల తో గడిపిన సందర్భాలు అభిమానులతో పంచుకుంటుంట‌ారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కూడా తమ పిల్లల గురించి నటీనటులు కొన్ని విషయాలను పరిచయం చేస్తుంటారు.

అంతే కాకుండా తాజాగా ఐశ్వర్యరాయ్ తన కూతురు డాన్స్ వీడియో అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.

ఎందుకంటే తన అందంతో ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, తన నటనతో కూడా మంచి పేరు సంపాదించుకుంది ఐశ్వర్య.అంతే కాకుండా తెలుగులో కూడా నటించి తెలుగు అభిమానులను కూడా పెంచుకుంది.

ఇక 2007లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక వీరికి ఓ కూతురు ఆరాధ్య బచ్చన్ ఉండగా.ఐశ్వర్యరాయ్ ఎక్కడికి వెళితే అక్కడ చాలాసార్లు మీడియా దృష్టిలో పడింది.

Telugu Aaradhya, Aishwarya, Bollywood, Dance-Movie

తాజాగా ఆరాధ్య ఓ వేదికపై డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో తన తల్లి ఐశ్వర్యరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.ఇటీవలే ఐశ్వర్య బచ్చన్ కుటుంబం తమ బంధువుల వివాహానికి హాజరు కాగా అందులో వేదికపై ఐశ్వర్య అభిషేక్ తో పాటు ఆరాధ్య కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన దేశి గర్ల్ పాటకు డాన్స్ చేసింది.ఎంతో ముద్దుగా డాన్స్ చేస్తున్న ఆరాధ్య వీడియో బాగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టనుంది.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube