జూనియర్‌ బచ్చన్‌ మరోసారి బట్టలు విప్పి మరీ మాట్లాడాడు  

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ గురించి సోషల్‌ మీడియాలో ఎప్పుడు కూడా జోకు పేళుతూనే ఉంటాయి. తండ్రి, భార్య సంపాదిస్తూ ఉంటే అభిషేక్‌ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్స్‌ చేశారు. ఎవరేం అన్నా కూడా చాలా పాజిటివ్‌గా అభిషేక్‌ స్పందిస్తాడు. తన గురించి ఎవరైనా కామెంట్‌ చేస్తే నిర్మొహమాటంగా సమాధానం చెప్తాడు. తన తండ్రి, భార్య సంపాదన మీద నేను బతకడం లేదు. నేను వ్యాపారాలు చేస్తున్నాను, వ్యాపారాల నిమిత్తం నేను విదేశాల్లో తిరుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Aishwarya Got Paid More Than Me Abhishek Bachchan-Aishwarya Remuneration Speaking On Pay Parity

Aishwarya Got Paid More Than Me Abhishek Bachchan

ఎప్పటికప్పుడు తన విషయాలను తన కుటుంబ సభ్యుల విషయాలను నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పే అభిషేక్‌ బచ్చన్‌ తాజాగా మరోసారి అదే విధంగా మాట్లాడాడు. నిర్మొహమాటంగా మాట్లాడడాన్ని కొందరు బట్టలు విప్పి మరీ మాట్లాడుకుంటారు. అలా అభిషేక్‌ బచ్చన్‌ కూడా అన్ని విషయాలను మీడియా ముందు ఉంచడంతో అభిషేక్‌ బట్టలు విప్పి మరీ నిజాలు చెప్పాడు అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి. ఈ సందర్బంగా తన భార్య ఐశ్వర్య రాయ్‌ పారితోషికం గురించి మాట్లాడాడు.

Aishwarya Got Paid More Than Me Abhishek Bachchan-Aishwarya Remuneration Speaking On Pay Parity

తన భార్య పారితోషికం నా కంటే చాలా ఎక్కువ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. నా భర్యతో కలిసి ఇప్పటి వరకు 9 సినిమాల్లో నటించాను. ఒక్క సినిమాలో మినహా మిగిలిన అన్ని సినిమాల్లో కూడా నా కంటే ఐశ్వర్య ఎక్కువ పారితోషికం తీసుకుంది. ఆమెకు క్రేజ్‌ ఉంది కనుక ఆమె పారితోషికం దక్కించుకుంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. బాలీవుడ్‌లో ప్రతిభకు తగ్గట్లుగా పారితోషికం ఉంటుందని జూనియర్‌ బచ్చన్‌ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో స్త్రీ పురుషులు అనే తేడాలు లేనందుకు సంతోషంగా ఉందని అభిషేక్‌ అన్నాడు.