ఐశ్వర్య - ధనుష్.. విడాకులకు ముందు ఎన్ని ఆస్తులు కూడబెట్టారో తెలుసా?

ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రిటీల విడాకులు ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.గతంలో సమంత నాగచైతన్య విడాకులు సంచలనంగా మారిపోయాయ్.

 Aishwarya Danush Properties, Aishwarya , Danush, Kollywood , Divorce , Propertie-TeluguStop.com

ఎన్నో రోజుల నుంచి వీరు విడాకులకు సంబంధించిన చర్చ జరిగింది ఇక ఇటీవలే టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా ఉన్న ఐశ్వర్య ధనుష్ కూడా 18 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు అంటూ చెప్పి విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.కేవలం టాలీవుడ్ కోలీవుడ్ లో మాత్రమే కాదు అంతటా వీరి విడాకులకు సంబంధించిన చర్చ మాత్రం జరుగుతూనే ఉంది.

అయితే ఐశ్వర్య సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె అన్న విషయం దాదాపు సినీ ప్రేక్షకుల అందరికీ తెలుసు.

కానీ ధనుష్ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

తమిళంలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కస్తూరి రాజా చిన్న కుమారుడు ధనుష్.ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ కూడా పలు సినిమాలకు నిర్మాతగా దర్శకుడిగా కూడా పనిచేశారు.

అయితే ఒక వైపు ఐశ్వర్య దర్శకురాలిగా సింగర్ గా కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారూ.

ఇక భారీగానే ఆదాయం కూడా సంపాదించారు.ఇక ధనుష్ కూడా కోలీవుడ్లో మంచి పేరున్న హీరోగా కొనసాగుతుండడంతో ఆయన కూడా భారీగానే సంపాదించారు.ఇక వీరిద్దరి విడాకులకు సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక వీరిద్దరూ ఇప్పటివరకు ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అన్న చర్చ కూడా మొదలయింది.

అయితే ఐశ్వర్య ధనుష్ ఉమ్మడిగా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని ఒక టాక్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.గత సంవత్సరం ధనుష్ ఆస్తుల విలువ 160 కోట్లను దాటేసింది.అయితే గత ఐదేళ్లలో హీరోగా ఎంతగానో ఎదిగిన ధనుష్ సంపాదించింది 200 కోట్లకు పైగానే అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.సినిమాలు మాత్రమే కాదు నిర్మాతగా కూడా ధనుష్ సత్తా చాటుతున్నారు.

ఇక మొన్నటి వరకూ తన భార్య ఐశ్వర్య పిల్లలతో కలిసి ఉన్న ఇల్లు ఖరీదు కూడా ఎక్కువేనట.దాదాపు 30 కోట్లకు పైగా ఎక్కువ ఖరీదు చేసే ఇంట్లో ఉండే వారట.

ఇలా వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 200 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టారు అన్న టాక్ మాత్రం కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం.

Properties of Aishwarya Dhanush #Dhanush

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube