జియోకి పోటి - ఎయిర్ టెల్ మూడు నెలల 4G డేటా ప్లాన్

జియో దెబ్బకి అన్ని కంపెనీలు తన డేటా ప్లాన్స్ ని తారుమారు చేస్తూనే ఉన్నాయి.జియో వచ్చినా తమ నెం.1 స్థానానికి ఢోకా లేదు అని ధీమగా ప్రకటించిన ఎయిర్ టెల్, ఇప్పుడు మరో కొత్త ప్లాన్ తో వినియోగదారుల ముందికి వచ్చింది.ఈ ప్లాన్ జియో అంత ఉపయోగకరంగా కాని, ఎకనామికల్ గా గాని లేకపోయినా, ఎయిర్ టెల్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న వినియోగదారులెవరైనా ఉంటే దీని గురించి ఆలోచించండి.

 Airtel Offers 30gb 4g Data For 1495 Rupees-TeluguStop.com

₹1,495 కి ఒక కొత్త డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది ఎయిర్ టెల్.ఈ మొత్తంతో ప్రీపేయిడ్ వినియోగదారులు రిచార్జ్ చేసుకుంటే వారికి మూడు నెలల కోసం 30జిబి 4G డేటా లభిస్తుంది.

ఒక్కసారి 30జిబి మార్కుని దాటేసాక స్పీడ్ కాస్త 64 KBPS కి పడిపోతుంది.అంటే 2G అన్నమాట.

అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇది పూర్తిగా డేటా ప్లాన్.దీని ద్వారా ఎలాంటి కాల్స్ కాని, మెసెజ్ బ్యాలెన్స్ కాని రాదు.

కేవలం 30జిబి 4G డేటా వస్తుంది.ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ డేటాప్యాక్, త్వరలోనే దేశమంతటా అందుబాటులోకి వస్తుంది.

ఎలా ఉంది ఎయిర్ టెల్ ప్రవేశపెడుతున్న ఈ కొత్త డేటా ప్లాన్ ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube