ఎయిర్టెల్ అమ్మాయి జియో లోకి జంప్..!! ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-20   23:39:11  IST  Raghu V

ఎయిర్ టెల్ 4G అడ్వర్టైజ్ మెంట్ తో సెలబ్రెటీగా మారిన శాషా చెత్రి ఎయిర్ టెల్ ను వదిలేసింది. తన ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన శాషా ఇప్పుడు ఎయిర్ టెల్ ను వదిలి జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అన్నట్లుగా జియోకు వెళ్తుంది.దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఫేస్‌బుక్ లో పోస్టు చేసింది.

-

‘నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరూ ప్రయత్నాలు సాగించండి. తగినది ఎన్నుకోండి. జీవితంలో ప్రతీదీ ప్రయత్నించాల్సిదే! లేకపోతే తప్పొప్పులు ఎలా తెలుస్తాయి? ఇక్కడ ఒక విషయం నాకు నచ్చలేదు. నేను ఇతరులకు మాత్రమే… మీరు ఫలానా కంపెనీ సిమ్ వాడండి… సరైనది ఎంచుకోండి. అని చెబుతున్నాను. అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నేను కూడా ఒక్కొక్కటీ ప్రయత్నిస్తూ, అన్ని కంపెనీలనూ ట్రై చేస్తాను. అయితే ఇది నా చివరి నిర్ణయం కాదు. ఒకవేళ నాకు ఇతర కంపెనీల స్పీడ్ నచ్చకపోతే తిరిగి ఎయిర్‌టెల్‌కు తిరిగి వచ్చేస్తా!’ అని ఆ వీడియోలో నవ్వుతూ చెప్పింది.

రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్టు, యాంకర్లు ఛానళ్లు మారినట్టు ఈమె కూడా ఎయిర్‌టెల్ విడిచిపెట్టి జియోలోకి వెళ్లిపోతోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.