ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: చిప్స్ కొంటే ఫ్రీ డేటా..!

దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

 Airtel Free 2 Gb Data Bumper Offer For Customers, Airtel, Chips Packets, Lays,-TeluguStop.com

కొత్త కొత్త మార్గాల ద్వారా వినియోగదారులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించేందుకు ఎయిర్ టెల్ సిద్ధమైంది.ఇకపై కుర్ కురే, లేస్, అంకుల్ చిప్స్ కొన్నవాళ్లు ఫ్రీ డేటాను పొందవచ్చు.10 రూపాయల లేస్, కుర్ కురే, అంకుల్ చిప్స్ కొంటే 1 జీబీ ఫ్రీ డేటా పొందే అవకాశం ఉంటుంది.

20 రూపాయల చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తే 2 జీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది.ఎయిర్ టెల్ పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు ఈ ఆఫర్ అందిస్తోంది.వినియోగదారులు ఈ ఆఫర్ ను పొందాలంటే చిప్స్ ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న రీఛార్జ్ కోడ్ ను గుర్తించాల్సి ఉంటుంది.

అనంతరం ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ యాప్ లో రీఛార్జ్ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో కోడ్ ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ డేటాను మూడు రోజుల్లోనే వినియోగదారులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఆఫర్ ఉన్న చిప్స్ ప్యాకెట్లు ఎన్నిసార్లు కొనుగోలు చేస్తే అన్నిసార్లు ఈ ఆఫర్ ను ఎయిర్ టెల్ వినియోగదారులు పొందవచ్చు.ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ ఎయిర్ టెల్ పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగం వేగం పుంజుకుంటోందని తాము కూడా ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగానే ఎయిర్ టెల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని పెప్సికో ఇండియా డైరెక్టర్ దిలేస్ గాంధీ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube