ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎయిర్టెల్ యాడ్ గర్ల్...

భారతదేశ టెలికాం రంగంలో అత్యధిక వాటా శాతం కలిగిన ఎయిర్టెల్ సంస్థల ప్రకటనల్లో కనిపించే యువతి”సాషా చెట్రి” గురించి దాదాపుగా తెలియనివారుండరు.అంతేగాక ఈ అమ్మడు నటించిన ఎయిర్టెల్ ప్రకటనలు ప్రజలని బాగానే ఆకట్టుకున్నాయి.

 Airtel Ad Girl Who Got A Chance In Prabhas Movie-TeluguStop.com

కాగా ప్రస్తుతం సాషా చెట్రి తెలుగులో సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.

అయితే ఇందులో భాగంగా గతంలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్” హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.

 Airtel Ad Girl Who Got A Chance In Prabhas Movie-ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎయిర్టెల్ యాడ్ గర్ల్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడిని ఎవరు గుర్తించలేదు.కానీ ప్రస్తుతం సాషా చెట్రి తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.కే రాధాకృష్ణ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నరాధే శ్యామ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.కాగా ఇటీవలె ఈ చిత్ర యూనిట్ సభ్యులు రాధే శ్యామ్ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14వ తారీకున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే సాషా చెట్రి ప్రస్తుతం ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.వచ్చి రావడంతోనే ఈ అమ్మడు ప్రభాస్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకోవడంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో అడపదడపా సినిమా అవకాశాలు వరిస్తున్నట్లు సమాచారం.

#Crusial Role #Saha Setrry #RadhyamShyam #Gold Fish #Important Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు