సాధారణంగా ఎక్కువ ఖరీదు చేసే వస్తువులను, బంగారం, డైమండ్స్, లేదా డ్రగ్స్ వంటి పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వీటికి అడ్డుకట్ట వేస్తుంటారు.కానీ ఇవేవీ కాకుండా సాలె పురుగులను స్మగ్లింగ్ చేస్తూ, అధికారుల చేతికి దొరికారు.
ఈ వింత ఘటన ఫిలిప్పీన్స్లోని విమానాశ్రయ అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్న 119 బ్రతికున్న సాలెపురుగులను పట్టుకున్నారు… వారు తెలిపిన వివరాల మేరకు.
ఫిలిప్పీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది పోలాండ్ నుంచి వచ్చిన పార్సిల్ లో సాలీడులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో పోలాండ్ నుంచి జనరల్ ట్రాయాస్ లోని కావిట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ పార్సిల్ వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.ఎయిర్ పోర్ట్ కి వచ్చిన పార్సిల్ లలో ఇది ఎంత విచిత్రమైన ఆకారంలో ఉండటంతో అక్టోబర్ 28న అధికారులు కనుగొన్నారు.
వారికి అనుమానం రావడంతో ఆ పార్సిల్ విప్పిచూస్తే అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు.

ఆ పార్సిల్ నందు 119 బతికి ఉన్నా టరాన్టులా సాలీడు లు కనిపించాయి.వాటన్నింటిని ఓ చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాలో నుంచి రన్నింగ్ షూ లలో రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సాలీడు లకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేశారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న సాలీడులను గత నెల 29న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ మానిటరింగ్ యూనిట్ కి అప్పగించారు.
ఈ జాతికి చెందిన సాలీడులు పరిమాణంలో పెద్దగా ఉండి, వాటిపై వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఇది చాలా అరుదైన జాతి అని, ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉందని, ఫిలిప్పీన్స్లో ఈ జాతిని అంతరించిపోయే వన్యప్రాణుల జాబితాలో చేర్చినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.అయితే ప్రస్తుతం ఈ సాలిడ్ లను ఎక్కడినుంచి పార్సిల్ ఎవరి అడ్రస్ కు పంపించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి అంతరించిపోయే వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేసి వ్యాపారం చేసే వారికి జరిమానాతో పాటు, జైలు శిక్ష కూడా విధిస్తారు.గతంలో కూడా ఫిలిప్పీన్ నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.