ఎయిర్ పోర్టు డైరెక్టర్ నిర్లక్ష్యం.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిని అడ్డుకున్న సెక్యూరిటీ.. !

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది.కాగా నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పర్యటించి తిరిగి తిరుపతి నుంచి వెళ్తున్న సమయంలో ఆర్థికమంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ వీడ్కోలు చెబుదామని వెళ్లుతున్న సమయంలో రన్ వేకు వెళ్లే రెండో గేట్ దగ్గర ఎయిర్ పోర్టు అథారిటీ సెక్యూరిటీ అడ్డుకున్నారట.

 Airport Director Negligence Security Blocking Ap Finance Minister-TeluguStop.com

అయితే తాను ఏపీ ఆర్థిక శాఖ మంత్రినని చెప్పుకున్నా లోపలికి అనుమతించలేదట.

కాగా ఈ విషయంలో తిరుపతి ఆర్డీవో వివరణ ఇస్తూ ఎయిర్ పోర్టు డైరెక్టర్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని వెల్లడించారు.

 Airport Director Negligence Security Blocking Ap Finance Minister-ఎయిర్ పోర్టు డైరెక్టర్ నిర్లక్ష్యం.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిని అడ్డుకున్న సెక్యూరిటీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఏయిర్ పోర్టు అథారిటీ సెక్యూరిటీ మాత్రం లిస్టులో పేరు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని, ఆ లిస్టులో బుగ్గన పేరులేదని స్పష్టం చేశారు.ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకోవడం మామూలే.

ఇక ప్రజలకు అయితే ఇలాంటి ఎన్నో అవమానాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి.

#APFinance #Thirupathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు