188 మందితో సముద్రంలో కూలిన ఇండోనేసియా విమానం ! ఫైలెట్ ఢిల్లీ వాసి   Airoplane Crashed Into Sea With 188 People! The Pailet Was Delhi     2018-10-29   13:08:50  IST  Sai M

ఇండోనేసియా రాజధాని జాకార్తా నుంచి 188 మందితో బయల్దేరిన విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విమానంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, అయిదుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 188 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వివరాలు చూస్తే… జేటీ 610 అనే ఈ విమానం జకార్తా నుంచి పంకల్ పినాంగ్ అనే నగరానికి వెళ్లాల్సి ఉంది. ఇది బోయింగ్ 737 విమానమని భావిస్తున్నారు. ఇందులో 210 మంది వరకూ ప్రయాణించే వీలుంటుంది.

విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకు అంటే మన లెక్క ప్రకారం సోమవారం ఉదయం 06.33 గంటలకు అదృశ్యమైనట్లు సమాచారం. జాతీయ సహాయ దళ బృందం అధికార ప్రతినిధి యూసుఫ్ లతీఫ్ ఈ విమానం కూలిపోయిందని స్పష్టం చేశారు. కూలిన విమానంలో నుంచి బయటపడి, సముద్రంలో తేలుతున్న వస్తువుల ఫోటోలను ఇండోనేషియా విపత్తు నివారణ శాఖ అధికారి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.ఇంతకీ ఈ విమానానికి ఫైలెట్ గా వ్యవహరించింది ఢిల్లీ కి చెందిన భవ్యే సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి.