డ్రోన్ పైలట్ కావాలని అనుకుంటే, ఈ శిక్షణ తీసుకోవాలని మీకు తెలుసా?

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ స్పీడుగా దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే డ్రోన్ వ్యవస్థ అనేది బాగా దినదినాభివృద్ధి చెందుతోంది.

 Airbus Launches Drone Pilot Training Course In Bangalore Details, Drone Pilot, D-TeluguStop.com

ఫోటోగ్రఫీ, ట్రాన్స్ పోర్ట్, వ్యవసాయ పనులు, వాతావరణ పరిశోధన వరకూ అన్నిటిలో డ్రోన్( Drone ) వ్యవస్థ చొచ్చుకు పోయింది.తక్కువ ఖర్చు.

వేగంగా పని జరగడం వంటి కారణాలతో డ్రోన్ వ్యవస్థ వైపు జనులు బాగా ఆకర్షితులవుతున్నాయి.నేపథ్యంలో చాలా రంగాలు డ్రోన్ వైపు చూస్తున్న పరిస్థితి.

దాంతో డ్రోన్ పైలట్లకు( Drone Pilot ) మంచి డిమాండ్ పెరుగుతోంది.డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ప్రత్యేక శిక్షణ అనేది అవసరం.

అందుకోసం యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్( AirBus ) డ్రోన్ పైలట్ల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

Telugu Airbus, Bangalore, Dgca, Drone, Drone Pilot, Job, Latest-Latest News - Te

ఈ కంపెనీ ఇప్పుడు భారత్ లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్స్ తీసుకు వస్తోంది.ఇది కేవలం 5 రోజుల సర్టిఫికెట్ కోర్స్.దీని కోసం డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) సంస్థ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జూన్‌ 26 నుంచి ప్రారంభమవుతాయని ఈ కంపెనీ తెలిపింది.ఈ క్రమంలో డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్‌ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది.

Telugu Airbus, Bangalore, Dgca, Drone, Drone Pilot, Job, Latest-Latest News - Te

ఇంకా సిమ్యులేటర్‌ శిక్షణతో పాటు ప్రాక్టికల్‌ ఫ్లయింగ్‌ పాఠాలు కూడా ఇందులో ఉంటాయని చెబుతున్నారు.ఆసక్తికరమైన అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేయవలసి ఉంటుంది, అదేవిధంగా 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ఈ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి.

అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, ఔత్సాహికులైన అభ్యర్థులు వెంటనే మేలుకుంటే బావుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube