ఆమె మన కాలపు లీడర్: గ్రేటా థన్‌బెర్గ్‌పై లియోనార్డో డికాప్రియో ప్రశంసలు

శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియా కమ్యూనిటీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.ఇకపై అనధికార పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ సీఈవో బ్రియాన్ చెస్కీ తెలిపారు.

 Airbnb Bans Party Houses After Five Die In California Halloween Party-TeluguStop.com

అద్దె గృహాల్లో పార్టీలను నిషేధించడంతో పాటు గెస్ట్ కండక్ట్‌ను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.శాన్‌ఫ్రాన్సిస్కోలో హాలోవీన్ పార్టీ జరిగిన ఫోర్ బెడ్‌రూమ్ ఇంటిని ఓ మహిళ ఎయిర్‌బీఎన్‌బీ నుంచి అద్దెకు తీసుకుందని బ్రియాన్ తెలిపారు.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా ఆస్తామాతో బాధపడుతున్న తన కుటుంబసభ్యులకు కాస్త ఉపశమనం కలిగించేందుకే గదిని బుక్ చేసుకున్నట్లు ఆమె తెలిపినట్లుగా సీఈవో వెల్లడించారు.ఒక వారం ముందు ఒరిండాకు ఉత్తరాన 60 మైళ్లదూరంలో ఉన్న సోనామా కౌంటీలో మంటలు చెలరేగడంతో తమ సిబ్బంది గదిని రిజర్వ్ చేశారని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత సదరు ఇంటిలో హలోవీన్ పార్టీ జరుగుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 100 మందిని రప్పించారని చెస్కీ తెలిపారు.తాము అద్దె ఇంటిలో ఎటువంటి పార్టీకీ అనుమతివ్వలేదని వెల్లడించారు.

Telugu Calinia, Halloween, Houses-

ఇంటి యజమాని డోర్‌బెల్ కెమెరా నుంచి లోపల పదుల సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.వారు వచ్చేలోపే పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయని బ్రియాన్ చెస్కీ తెలిపారు.మరణించిన వారంతా 30 ఏళ్లలోపు వారేనని.వీరంతా శాన్‌ఫ్రాన్సిస్కోలోని సంపన్న ప్రాంతమైన బే ఏరియాకు చెందినవారుగా కాంట్రా కోస్టా షెరీఫ్ కార్యాలయం తెలిపింది.మరణించిన ఐదుగురిలో ముగ్గురు ఘటనాస్థంలో ప్రాణాలు కోల్పోగా… మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మృతులను టియాన్ ఫర్లే, ఒమర్ టేలర్, రామోన్ హిల్ జూనియర్, జావిన్ కౌంటీ, ఓషియానా టామ్‌ప్కిన్స్‌గా పోలీసులు గుర్తించారు.

మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కో కాల్పులపై స్పందించిన కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్… తుపాకి నియంత్రణ చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు.ఈ విషాదంలో తాము బాధితులందరికీ అండగా ఉంటామని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube