యూకేకు వెళ్లాలనుకుంటున్నారా... మీకో గుడ్‌న్యూస్..!!

యూకేలో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ ఆ దేశాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.

 Air Travel Between India-uk To Resume Partially From January 8 With 30 Weekly Fl-TeluguStop.com

ముందు జాగ్రత్త చర్యగా అక్కడ లాక్‌డౌన్ ‌విధించినప్పటికీ పరిస్థితి క్రిటికల్‌గానే వుంది.మరోవైపు ఇప్పటికి అనుభవిస్తున్నది చాలదన్నట్లు.

స్ట్రెయిన్ తమ కొంప ఎక్కడ ముంచుతుందోనని అన్ని దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను, వెళ్లే విమానాలను నిషేధించాయి.

అటు భారత ప్రభుత్వం సైతం బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో పరిస్థితుల నేపథ్యంలో యూకే ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం జనవరి 7 వరకు పొడిగించింది.ఇందుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ ఈ బుధవారం కీలక ప్రకటన చేశారు.

జనవరి 7 తర్వాత సర్వీసులను పునరుద్ధరించినా అది కఠిన ఆంక్షలతో కూడుకున్నదై ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పూరీ చెప్పారు.దీంతో యూకేలో వున్న భారతీయులు, మనదేశంలో వున్న బ్రిటన్ జాతీయులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.

ఈ నిషేధం ఎప్పుడు ఎత్తేస్తారో తెలియక తల పట్టుకున్నారు.ఈ నేపథ్యంలో వీరిందరికి భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Telugu Corona, India, Civil, Modern Vaccine, Pfizer Vaccine, Wave, Strain-Telugu

భారత్‌, బ్రిటన్‌ల మధ్య నిషేధించిన విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించింది.ఈనెల 8 నుంచి విమాన సర్వీసులను స్వల్పంగా ప్రారంభిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.జనవరి 23 వరకు వారానికి 15 విమాన సర్వీసులకు కేంద్రం వీలు కల్పించింది.అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి.

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిసిఎ ప్రకటిస్తుందని హర్‌దీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.మరోవైపు దేశంలో యూకే స్ట్రెయిన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.శుక్రవారం కొత్తగా నలుగురికి కొత్త రకం వైరస్ నిర్థరణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube