అప్పట్లో విమాన టికెట్లు బుక్ చేసిన వారికి శుభవార్త!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల మార్చి నెలాఖరు నుంచి లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.కేంద్రం లాక్ డౌన్ లో భాగంగా వ్యాపార, వాణిజ్య సేవలతో పాటు బస్సు, రైలు, విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.

 Air Tickets Booked Between March To May Fully Refunded, Air Tickets, Lockdown, T-TeluguStop.com

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మార్చి 25 నుంచి మే 3 మధ్య టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఆ డబ్బులు వెనక్కు రాలేదు.

అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ప్రయాణ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోగా అ డబ్బులు తిరిగి రాకపోవడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొందరు ప్రయాణికులు ఏం చేయాలో పాలుపోక సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు పిటిషన్లను విచారణకు స్వీకరించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను ప్రశ్నించగా డీజీసీఏ విమాన టికెట్లను బుక్ చేసుకున్న వారికి శుభవార్త చెప్పింది.

ఎవరైతే లాక్ డౌన్ విధించిన సమయంలో టికెట్లను బుక్ చేసుకున్నారో వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని పేర్కొంది.

డీజీసీఏ నిర్ణయంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఊరట కలిగినట్లైంది.మరోవైపు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

దేశంలో పరిమిత సంఖ్యలోనే విమాన ప్రయాణాలకు కేంద్రం ప్రస్తుతం అనుమతిస్తోంది.మరోవైపు రైళ్లు, బస్సుల ప్రయాణాలపై దేశంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

కేంద్రం మొదట పరిమిత సంఖ్యలోనే రైళ్లకు అనుమతులు ఇవ్వగా ఈ నెల 12 నుంచి మరికొన్ని రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది.బస్సు ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు తొలగించినా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రలకు బస్సులు నడపటానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube