ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య మళ్లీ పెరిగింది.24 గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

మార్పుల నేపథ్యంలో సాధారణ స్థితి నుంచి కాలుష్యం ఒక్కసారిగా సివియర్ కేటగిరికి వచ్చేసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సాధారణ స్థితిని దాటింది.నిన్న గాలి నాణ్యత 371 పాయింట్లుగా ఉండగా ఇవాళ 405 పాయింట్లకు చేరింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఆనంద్ విహార్ లో 405 పాయింట్లు, మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వద్ద 404 పాయింట్లు మరియు జహంగీర్ పురిలో428 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదు అయింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు