అభినందన్‌ మళ్లీ యుద్ద విమానం ఎక్కే ఛాన్స్‌ లేదా... వైరల్‌ అవుతున్న ఎయిర్‌ మార్షల్‌ ఛీప్‌ వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ యుద్ద విమానంను ప్రాణాలకు తెగించి కూల్చి వేసిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమెండర్‌ విక్రమ్‌ అభినందన్‌ టెక్నికల్‌ ఇష్యూ కారణంగా పాకిస్థాన్‌ లో క్యాష్‌ ల్యాండ్‌ అవ్వడం, ప్యారచూట్‌ సాయంతో పాకిస్థాన్‌ భూ భాగంలో పడటం అన్ని కూడా దేశ వ్యాప్తంగా హై టెన్షన్‌ను క్రియేట్‌ చేశాయి.పాకిస్థాన్‌కు చెందిన కొందరు అభినందన్‌పై దాడి చేయడం జరిగింది.

 Air Marshal Chief Of India Speech Goes Viral About Abhinandan Health-TeluguStop.com

ఆ వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో అభినందన్‌ పాకిస్థాన్‌ చెరలో ఉన్నట్లుగా వెళ్లడైయ్యింది.వెంటనే జెనీవా ఒప్పందంను ఇండియా తెరపైకి తీసుకు వచ్చింది.

శత్రుదేశంలో ఉన్నా కూడా ఏమాత్రం బెదరకుండా దేశంకు చెందిన రహస్యాలు చెప్పేందుకు నిరాకరించిన గొప్ప ధీరుడు, రియల్‌ హీరో అభినందన్‌.ప్రభుత్వం మరియు అంతర్జాతీయ స్థాయి నుండి పాకిస్థాన్‌ పై ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు రోజులు తిరగకుండానే అభినందన్‌ను ఇండియాకు అప్పగించిన విషయం తెల్సిందే.ఇండియాకు అభినందన్‌ అయితే వచ్చాడు.అయితే తిరిగి ఆయన విధులను నిర్వహిస్తాడా లేడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఇండియాకు అభినందన్‌ తిరిగి వచ్చిన తర్వాత రెండు రోజుల పాటు ఆయనకు అన్ని రకాల వైధ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.

తాజాగా అభినందన్‌ తిరిగి డ్యూటీలో జాయిన్‌ అవ్వడం గురించి ఎయిర్‌ మార్షల్‌ ఛీప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.ఆయన మాటలను బట్టి చూస్తుంటే అభినందన్‌ మళ్లీ యుద్ద విమానం ఎక్కే అవకాశం లేదనిపిస్తుంది.ఎందుకంటే ఆయన శారీరకంగా మరియు మానసికంగా కూడా సంసిద్దంగా లేడని, ఆయన సంసిద్దతను నిరూపించుకుంటనే అతడిని మళ్లీ ఎయిర్‌ పైలెట్‌గా తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

అంటే అభినందన్‌ ప్లేన్‌ క్యాష్‌ అయిన సమయంలో ప్యారచూట్‌ సాయంతో ల్యాండ్‌ అవ్వడం జరిగింది.

ఆ సమయంలో అతడికి గాయాలు అయ్యాయి.ఆ గాయాలు మళ్లీ ప్లేన్‌ నడిపే సమయంలో అదే సందర్బం ఎదురు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, అందుకే పూర్తి సంసిద్దత అయిన తర్వాత మాత్రమే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు తిరిగి అభినందన్‌ సేవలు అందిస్తాడని ఎయిర్‌ మార్షల్‌ ఛీప్‌ అన్నారు.

అభినందన్‌ తిరిగి రావడంతో దేశ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అయ్యింది.

అయితే ఆయన్ను మళ్లీ యుద్ద విమానం ఎక్కక పోవచ్చు అనే వార్త ఎంతో దిగులుకు గురి చేస్తుంది.అయితే పూర్తి స్థాయి సంసిద్దత లేకుండా యుద్ద విమానాలు నడపడం ఏమాత్రం సబబు కాదు.

ఈ విషయంలో ఎయిర్‌ మార్షల్స్‌ నిర్ణయాన్ని అంతా గౌరవించడం బెటర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube