5జీ సిగ్నల్స్ రగడ.. బోయింగ్ నుంచి హామీ, అమెరికా- భారత్ మధ్య మళ్లీ విమాన సర్వీసులు

విమానాశ్రయాల్లోని రన్‌వేల వద్ద 5జీ సిగ్నల్స్‌కు చెందిన టవర్స్ ఏర్పాటు చేయవద్దంటూ అమెరికాలోని ఎయిర్‌లైన్ సంస్థలు వైట్‌హౌస్‌కు లేఖ రాసిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు విమాన సేవలు నిలిచిపోయాయి.

 Air India To Resume Normal Services Between India And Us From January 21 , Air I-TeluguStop.com

ఎయిరిండియా కూడా సర్వీసులను నిలిపివేసింది.దీని కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎయిరిండియా శుభవార్త చెప్పింది.

భారత్‌-అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.జనవరి 21 (శుక్రవారం) నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.‘5జీ’ ఆందోళనలతో బుధవారం రద్దు చేసిన 8 సర్వీసుల్లో ఆరింటిని గురువారమే తిరిగి ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.5జీ సేవల కారణంగా విమానాల్లోని రేడియో అల్టీమీటర్లు ప్రభావితమవుతాయని.ఫలితంగా ఇంజిన్, బ్రేకింగ్‌ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) స్పందించి.గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.

బోయింగ్‌ 777 రకం సహా కొన్ని విమానాల అల్టీమీటర్లపై ‘5జీ’ ప్రభావం ఉండదని తెలిపింది.ఈ క్రమంలోనే బోయింగ్ 777 తరగతి విమానాలను అమెరికాకు నడిపేందుకు వీలుగా ఎయిరిండియాకు బోయింగ్‌ సంస్థ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఎఫ్ఏఏ నిర్ణయంతో.ఎయిరిండియా బాటలోనే బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి సంస్థలు కూడా అమెరికాకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి.

కాగా.టెలికాం సంస్థలు ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌‌లు అమెరికాలో 5జీ సేవలను ప్రారంభించినట్లుగా గురువారం ప్రకటించాయి.ప్రస్తుత వివాదం నేపథ్యంలో విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను పొందాయి.ముందుగా అనుకున్న దాని ప్రకారం.

అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల సాధ్యపడలేదు.

Air India To Resume Normal Services Between India And US From January 21 , Air India, India-America, Federal Aviation Administration, Telecom Companies AT&T, Verizon, GHz Frequency, - Telugu Air India, Airindia, Federal, Ghz Frequency, India America, Telecom Atampt, Verizon

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube