కొండ పై అపచారం, చక్కర్లు కొట్టిన విమానం

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అపచారం జరిగింది.నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉన్న తిరుమల కొండ పై ఒక విమానం చక్కర్లు కొట్టడం తో అపచారం చోటుచేసుకుంది.

 Air India Plane Flies Over Tirumala Temple-TeluguStop.com

రెండు రోజులుగా ఓ విమానం అక్కడక్కడే చక్కర్లు కొడుతోంది.అయితే అది కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానం అన్నట్లు గా తెలుస్తుంది.

దీనితో ఆ విషయాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది.అయితే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉన్న సంగతి తెలిసిందే.

కొండ పై దేవతలు విహరిస్తూ ఉంటారు అన్న నేపథ్యంలో కొండ పై ఎలాంటి విమానాలు విహరించవు.ఆలా ఒకవేళ విమానాలు తిరిగితే అది పెద్ద అపచారం అని అందరూ నమ్ముతూఉంటారు.

అంతేకాకుండా సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వలన.విమానాలు తిరిగితే అవి పేలిపొయే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తూ ఉంటారు.బ్రిటీష్ వారి హయాంలో ఇలా రెండు విమానాలు పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.అయినప్పటికీ అప్పుడప్పుడు కొండపై విమానాలు చక్కర్లు కొడుతుంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube