టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పిడుగుపాటు కు గురైన విమానం!  

Air India Flights Suffer Damages After Severe Thunderstorms-air India Plane,new Delhi To Vijayawada,severe Thunderstorms

ఎయిర్ ఇండియా కు చెందిన ఒక విమానం పిడుగుపాటుకు గురైనట్లు తెలుస్తుంది.శనివారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

Air India Flights Suffer Damages After Severe Thunderstorms-Air Plane New Delhi To Vijayawada Thunderstorms

ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా కు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7:28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది.అయితే రాత్రి 9:40 గంటలకు విజవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా,ఈ మధ్యలో పిడుగుపాటుకు గురైనట్లు తెలుస్తుంది.విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు,పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమవ్వడం తో నేరుగా విమానం మీద పిడుగు పడకున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం విమానం పై పడినట్లు సమాచారం.దీనితో ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడనప్పటికీ కొంత మంది సిబ్బంది మాత్రం గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే పిడుగు పాటుకు గురైన విమానం ఆ సమయంలో విమానం గాల్లో ఊయలలా అటూ ఇటూ ఊగిపోయిందట.

Air India Flights Suffer Damages After Severe Thunderstorms-Air Plane New Delhi To Vijayawada Thunderstorms

 

అయితే ప్రయాణికులు అందరూ కంగారు పడిపోయినప్పటికీ పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి సురక్షితంగా విమానం ను ల్యాండ్ చేయడం తో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.దీనితో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

.

తాజా వార్తలు

Air India Flights Suffer Damages After Severe Thunderstorms-air India Plane,new Delhi To Vijayawada,severe Thunderstorms Related....