విమాన ప్రమాదం : రన్‌వేపై జారి రెండు ముక్కలు, 14 మంది మృతి

కేరళలో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు భారీ ప్రమాదాలు జరిగాయి.భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పదుల సంఖ్యలో మృతి చెందారు.

 Airindia Flight Crash In Kerala - Telugu Breaking And Latest News , Air India, F-TeluguStop.com

ఆ విషాదం జరిగిన కొన్ని గంటల్లోనే కోజికోడ్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.దుబాయి నుండి కోజికోడ్‌ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం రన్‌ వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో జారి పడినది.

దాంతో విమానం రెండు ముక్కలు అయ్యింది.విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు సహా ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

కేరళలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే.వర్షాల కారణంగా రన్‌ వే పై నీరు చేరడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే ప్రాధమిక అంచనాకు అధికారులు వచ్చారు.

సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదంలో మొత్తం 15 మంది మృతి చెందగా 123 మంది గాయాల పాలయ్యినట్లుగా కేరళ పోలీసులు తెలియజేశారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.ప్రమాదం పై కేరళ సీఎం అధికారులతో మాట్లాడారు.సహాయక చర్యలకు భారీ ఎత్తున అధికారిక యంత్రాంగంను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పంపించాయి.గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube