అమెరికా వెళ్లాలనుకునే తెలుగువారికి శుభవార్త..!!

మెరుగైన జీవన ప్రమాణాలు, విద్య, ఉపాధి రంగాల్లో అద్భుత అవకాశాలు ఊరిస్తూ ఉండటంతో అగ్రరాజ్యం అమెరికా పెద్ద సంఖ్యలో విదేశీయులను ఆకర్షిస్తూ ఉంటోంది.భారతీయుల్లోనూ అమెరికా పట్ల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.

 Air India Direct Flights Hyderabad To America-TeluguStop.com

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.దశాబ్ధాల క్రితమే తెలుగు వారు ఖండాలు దాటి అమెరికా గడ్డపై అడుగుపెట్టారు.
సాధారణంగా మనదేశం నుంచి అమెరికా వెళ్లాలంటే నేరుగా విమానం ఉండదు.భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి విమానం ఎక్కి.దుబాయ్‌లో ఫ్లైట్ మారాల్సి వుంటుంది.సుదీర్ఘ ప్రయాణం, ఇంధన సమస్యలు, సాంకేతిక కారణాలతో కనెక్ట్ ఫ్లైట్ విధానంలో పలు విమానయాన సంస్థలు భారతీయులను అమెరికాకు చేరుస్తున్నాయి.

అయితే ఇలాంటి కష్టాలకు దశలవారీగా తెరదించాలని నిర్ణయించింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.ఇప్పటికే దేశ ఐటీ రాజధాని బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి ఎయిరిండియా మొట్టమొదటి సారిగా నాన్‌స్టాప్ విమానం నడుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి 11 నుంచి ఈ విమానం బెంగళూరు నుంచి టేకాఫ్ కానుంది.

Telugu Air India, Airindia, Direct Flights-Telugu NRI

తాజాగా హైదరాబాద్‌ నుంచి కూడా అమెరికాకు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపింది ఎయిరిండియా.హైదరాబాద్‌ నుంచి చికాగో వరకు ఈ సర్వీసును నడపనుంది. బోయింగ్ 777- 200 విమానాన్ని ఇందుకు ఉపయోగించనున్నారు.

ఈ విమానం 238 సీటింగ్ సామర్ధ్యంతో ఉంటుంది.కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ – అమెరికా మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణికులు అదనంగా పెరిగే అవకాశం వుందని ఎయిరిండియా అంచనా వేస్తోంది.

అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తుండటం.అమెరికా నుంచి పెట్టుబడులు రావడంతో హైదరాబాద్, చికాగోలను కలిపే కొత్త నాన్ స్టాప్ మార్గం.

ఎయిర్ పోర్ట్స్ కనెక్టివిటీ విష్ లిస్ట్‌లో కొంతకాలంగా ఉందని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ తెలిపారు.ఎయిర్ ఇండియా శంషాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ ప్రారంభించనుండటం కార్పొరేట్ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube