ఆరు రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ....రూ.5 లక్షల రివార్డ్ ప్రకటన

ఇటీవల ఏఎన్-32 భారత వైమానిక దళ విమానం గల్లంతైన సంగతి తెలిసిందే.ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా ఆ విమానం ఆచూకీ లభ్యం కాకపోవడం తో భారత వైమానిక దళం దాని ఆచూకీ తెలిపిన వారికి తాజాగా రివార్డ్ ను ప్రకటించింది.ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం 13 మంది ప్రయాణికులు, సిబ్బందితో గత సోమవారం మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో అసోంలోని జోర్హాత్‌ నుంచి బయల్దేరింది.ఈ విమానం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమీ జిల్లాలో గల మెచుకా అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు చేరాల్సి ఉంది.అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఏఎన్‌-32 విమానానికి ఏటీఎఫ్‌తో సంబంధాలు తెగిపోయాయి.

 Air Force Announces Rs 5 Lakh Reward For Information On Missing An 32-TeluguStop.com

దీనితో విమానం మిస్ అయ్యింది అని గుర్తించిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆరు రోజులు గడుస్తున్నా దొరకన�

అయితే విమానం మిస్ అయిన ప్రాంతం దట్టమైన అడవి కావడం తో గాలింపు చర్యలలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఇంకా ఆరు రోజులు గడిచినప్పటికీ ఆ విమానం ఆచూకీ లభించకపోవడం తో వైమానిక అధికారులు రూ.5 లక్షల రివార్డు ను ప్రకటించింది.తూర్పు వైమానిక దళ విభాగానికి చెందిన ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌.డి.మాథుర్ విమానం ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ మొత్తం ఇస్తామని శనివారం ప్రకటించారు.విమాన ఆచూకీ తెలిపినా, దానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఇచ్చినా ఈ రివార్డు అందజేస్తామన్నారు.9436499477, 9402077267, 9402132477 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలనికోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube