మరో వివాదానికి నెట్ ఫ్లిక్స్ సినిమా దారితీయనుందా..?!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ మరో వివాదాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ నుండి ఇటీవల తాజాగా ఏకే వర్సెస్ ఏకే అనే సినిమాను విడుదలచేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 Indian Air Force Objects Scenes In Anil Kapoor's Ak Vs Ak Movie, Ak Vs Ak Movie-TeluguStop.com

ఈ సినిమాలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర వహిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో అనిల్ కపూర్ తో పాటు ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఓ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించాడు.

ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను డిసెంబర్ 7న విడుదల చేసింది చిత్రబృందం.అంతేకాదు ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

అయితే ఈ సినిమాలో హీరో అనిల్ కపూర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.ఈ నేపథ్యంలో సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా స్పందించింది.

ఇందులో భాగంగానే అనిల్ కపూర్ వేసుకున్న యూనిఫామ్, అలాగే అతడు వాడిన భాష సరిగా లేదంటూ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.అయితే ఈ విషయం సంబంధించి అనిల్ కపూర్ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

తను నటించిన సినిమా ట్రైలర్ కొందరి మనోభావాలను దెబ్బ తీసినట్లు తనకు తెలిసిందని, ఇందులో భాగంగానే భారత వైమానిక దళం యూనిఫామ్ ధరించి అటువంటి భాష మాట్లాడటం సినిమాలో చేసిన తప్పే అంటూ అందుకు తనను క్షమించాలని అనిల్ కపూర్ కోరాడు.

ఇది ఇలా వుండగా ట్రైలర్ కే ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావడంతో, ఒకవేళ సినిమా రిలీజ్ అయితే ఏలాంటి స్థాయిలో వివాదాలు తలెత్తుతాయయో అని సినిమా వర్గాలు ఆలోచిస్తున్నాయి.ఏదేమైనా సినిమా నిర్మాతలు, దర్శకులు భారత త్రివిధ దళాల కథ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో జాగ్రత్తలు వహించి వాటిని తెరకెక్కించాలి అందులో ఏదైనా తేడా వచ్చిన వారందరూ పడిన కష్టమంతా నేలపాలు అవుతుంది.అయితే ఈ మధ్య కాలంలో ఓటిటి ఫ్లాట్ ఫాం లో విడుదల అవుతున్న కొన్ని సినిమాల పై అనేక రకాల వివాదాలు చుట్టుముట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం.

దీంతో వాటిపై కూడా సెన్సార్ బోర్డు నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇదివరకే కొన్ని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.చూడాలి మరి అనిల్ కపూర్ ఈ విధంగా స్పందించడంతో ఆ సినిమాలో ఎలాంటి మార్పులు చేస్తారో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube