టోక్యో ఒలింపిక్స్.. వారందరికి ఉచిత విమాన ప్రయాణం..!

నేటితో టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.భారత్ మొత్తం 7 పతకాలు వచ్చాయి.

 Air First Offer Free Travel Tokyo Olympics Medalist , Air First, Free Travel, Ol-TeluguStop.com

ఈ ఒలింపిక్స్ లో భారత తరపున గెలిచిన అథ్లెట్లకు స్టార్ ఎయిర్ విమానయాన సంస్థ సూపర్ ఆఫర్ ఇచ్చింది.గో ఫస్ట్ గతంలో గో ఎయిర్ విమానయాన సంస్థ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వారందరికి ఐదేళ్ల పాటు ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ ప్రకటించింది.

భారత్ తరపున 7 పతకాలు ఎప్పుడూ లభించలేదని.ఇది వేడుక చేసుకోవాల్సిన టైం అని.అందుకే 2025 వరకు వారికి వర్తించేలా వారందరికి ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని గో ఫస్ట్ వెల్లడించింది.టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించగా.

మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ లో.రవి దహియా రెజ్లింగ్ లో.రజతాలు అందుకున్నారు.

పీవీ సింధు బ్యాడ్మింటన్, భజరంగ్ పునియా రెజ్లింగ్, లవ్లీనా బోర్గోహైన్ బాక్సింగ్, పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు సాధించింది.

వీరందరికి ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ అందించారు.అంతేకాదు స్టార్ ఎయిర్ సంస్థ కూడా జీవిత కాల ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనతో అందరిని మెప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube