విమానంలో నిద్రపోయింది, లేచి చూసేప్పటికి ఏం జరిగిందంటే.. రెండు గంటలు నరకం చూసింది  

Air Canada Passenger Face Terrifying Situation-

మొదటి సారి విమాన ప్రయాణం చేసే సమయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.అయితే తరచు విమాన ప్రయాణం చేసే వారు కూడా అప్పుడప్పుడు తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది.

Air Canada Passenger Face Terrifying Situation--Air Canada Passenger Face Terrifying Situation-

తాజాగా కెనడాకు చెందిన ఎయిర్‌వేస్‌లో ఒక లేడీ ప్రయాణించింది.అయితే ఆమె ప్రయాణంలో నిద్రపోయింది.నిద్ర పోయిన ఆ మహిళను ఎవరు లేపక పోవడంతో ఆమె అలాగే నిద్ర పోయింది.ఆమె నిద్ర నుండి లేచి చూసి భయాందోళనకు గురై రెండు గంటల పాటు నరకం చూసింది.

Air Canada Passenger Face Terrifying Situation--Air Canada Passenger Face Terrifying Situation-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎయిర్‌ కెనడా విమానం తాజాగా క్యూబెక్‌ నుండి టొరంటో వరకు ప్రయాణించింది.ఈ ప్రయాణం కేవలం గంటన్నర మాత్రమే.ఈ విమానంలో స్టేల్లా హౌజీ అనే మహిళ ఎక్కింది.ఆమె విమానం ఎక్కిన కొద్ది సేపటికి నిద్రలోకి జారుకుంది.నిద్ర పోయిన ఆమెను ప్రయాణికులు ఎవరు లేపేందుకు ఆసక్తి చూపించలేదు.విమానం ల్యాండ్‌ అయ్యింది.అంతా కూడా దిగేశారు.అయితే ఆమెను మాత్రం ఎవరు పట్టించుకోలేదు.

ఎయిర్‌ హోస్టెస్‌ ఎవరు కూడా ఒక లేడీ అందులో ఉందనే విషయాన్ని గుర్తించలేదు.అంతా వెళ్లి పోయారు.రాత్రి అయ్యింది.అప్పుడే ఆమెకు మెలుకు వచ్చింది.లేచి చూసేప్పటికి అంతా కూడా చీకటిగా ఉంది.ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది.తాను విమానంలో ఒంటరిగా ఉన్నాను.అంతా దిగి పోయినా తాను మాత్రం నిద్ర మత్తులో ఉండి దిగలేదు అంటూ తెలుసుకుంది.ఏం చేయాలో పాలు పోలేదు.ఫోన్‌ చేద్దామంటే ఆమె ఫోన్‌ డెడ్‌ అయ్యింది.విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లి సమయంలో ఆమెకు ఒక టార్చ్‌ దొరికింది.

ఆ టార్చ్‌ సాయంతో విమానం డోరు వద్దకు వెళ్లింది.డోరు తీయగా చాలా ఎత్తుగా ఉంది.విమానం ఎక్కేందుకు వినియోగించే నిచ్చన లేదు.దాంతో అక్కడ నుండి దూకే ప్రయత్నం చేయలేదు.విమానాశ్రయంకు కొద్ది దూరంలో విమానం ఉంది.విమానాశ్రయంలోని ఎవరికైనా కనిపించేలా టార్చ్‌ లైట్‌ను చాలా సేపు అటు ఇటు కదిలించింది.

చివరకు ఒక వ్యక్తి ఈమె టార్చ్‌ లైట్‌ను గమనించడంతో సిబ్బంది వచ్చారు.దాంతో రెండు గంటలు పడ్డ టార్చర్‌కు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.అందుకే తక్కువ సమయం ప్రయాణం ఉన్న సమయంలో అస్సలు నిద్ర పోవద్దని పెద్దలు అంటూ ఉంటారు.