తుఫాను కార‌ణంగా...క‌న్న కొడుకును అమ్ముకోవాల్సి వ‌చ్చింది.! ఇప్పుడు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా ఏడ్వ‌డం త‌ప్ప నేనేమి చెయ్య‌గ‌ల‌ను.!?

నేను ఎంత పెద్ద తప్పు చేశానో మీకు తెలియ‌దు.క్ష‌మించ‌రాని నేరం అది.

 Aila Toofan Separates Mother And Son-TeluguStop.com

అందుకు న‌న్ను ఆ దేవుడు క్ష‌మిస్తాడో లేడో తెలియ‌దు.క‌చ్చితంగా నా ప‌నికి క్ష‌మాప‌ణ అంటూ ఉండ‌ద‌నే అనుకుంటున్నా.

నేను ఆ ప‌ని చేసినందుకు నా కుమారుడు కూడా నన్ను క్ష‌మించ‌డు.అలాగే నా కుటుంబ స‌భ్యులు కూడా నేను చేసిన ప‌నిని ఎంత‌మాత్రం ఒప్పుకోరు.

ఎందుకంటే.నేను నా 6 ఏళ్ల కొడుకుని ఓ వ్య‌క్తికి అమ్మేశా.

ఏం చేస్తాం.నాకున్న మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు, నా భ‌ర్త‌ను పోషించుకునేందుకు నా ద‌గ్గ‌ర మ‌రో ఆలోచ‌న లేదు.

అందుకే నా కుమారుడ్ని అమ్మేశా.న‌లుగురి జీవితాలు నిల‌బ‌డాలంటే.

ఆ మాత్రం చేయ‌క త‌ప్ప‌ద‌ని అనిపించింది.నిజంగా ఈ ప‌నిని మాత్రం నేను నా జీవితంలో మ‌రిచిపోలేను.

4 ఏళ్ల కింద‌ట నేను నా బిడ్డ‌ను అమ్మ‌డానికి వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది.అప్ప‌ట్లో వ‌చ్చిన ఐలా తుపాను మా జీవితాల‌ను నాశ‌నం చేసింది.మాకున్న కొద్ది పాటి స్థలంలో చిన్న చిన్న పంట‌ల‌ను వేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటే.మ‌ధ్య‌లో వ‌చ్చిన ఐలా తుపాను అన్నింటినీ సర్వ నాశ‌నం చేసింది.మాకున్న బ్ర‌తుకు దెరువు పోయింది.దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు.

ఓ వైపు తిండి తిని చాలా రోజులైంది.అది అలాగే కొన‌సాగితే మేం అంద‌రం చ‌నిపోవ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నాం.

అందుకే నా పెద్ద కుమారుడిని అమ్మ‌క త‌ప్ప‌లేదు.

ఇప్పుడు నా పెద్ద కుమారుడు ఎక్క‌డ ఉన్నాడో తెలియ‌దు.నా క‌డుపు చించుకుని పుట్టిన నా బిడ్డను వాళ్లు ఏం చేశారో తెలియ‌దు.నా బిడ్డ‌ను నేను మ‌ళ్లీ క‌లుస్తానో కూడా తెలియ‌దు.

ఇదంతా ఆలోచిస్తుంటే.అస‌లు నేన‌ప్పుడు ఆ ప‌ని ఎందుకు చేశానా అనిపిస్తుంది.

ఆ విష‌యం గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నాకు, నా భ‌ర్త‌కు క‌లిగే వేద‌న అంతా ఇంతా కాదు.నా భ‌ర్త బిగ్గ‌ర‌గా దుఃఖిస్తుంటాడు.

నా బిడ్డ‌ను అమ్మ‌గా వ‌చ్చిన సొమ్ముతో మేం ఢాకా చేరుకున్నాం.ఇప్పుడు నేను నాలుగిళ్ల‌లో ప‌నిచేస్తున్నా.

నా భ‌ర్త కూలి ప‌నిచేస్తున్నాడు.ప్ర‌స్తుతం మా జీవితాల‌కు వ‌చ్చిన ఢోకా ఏమీ లేదు.

కానీ మా బిడ్డ మా ద‌గ్గ‌ర లేడ‌న్న ఒక్క విష‌య‌మే మాకు రోజూ నిద్ర లేకుండా చేస్తోంది.అది మాకు క‌లిగిన అతిపెద్ద న‌ష్టంగా మాకు అనిపిస్తుంది.

నా ఇద్ద‌రు పిల్ల‌లు అన్న ఏడమ్మా.అన‌డ‌గితే.

నాకు ఏం చెప్పాలో కూడా తెలియ‌డం లేదు.మాట‌లు రావ‌డం లేదు.

నా బిడ్డ నా ద‌గ్గ‌ర లేడ‌న్న విష‌యం క్ష‌ణ క్ష‌ణం గుర్తుకు వ‌స్తూనే ఉంటుంది.అలా గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నేను రాయిగా మారిపోతున్నా.

భ‌గ‌వంతుడా.ఈ క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌దు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube