సెకండ్ డోస్ ఆలస్యమైనా ఆందోళన వద్దు..!

ఇండియాలో కరోనా తీవ్రత ఎలా ఉందో అందరికి తెలిసిందే.కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ విజృంభిస్తుంది.

 Aiims Chief Doctor Randeep Guleria About Corona Vaccine Second Dose   Aiims,  Ch-TeluguStop.com

అయితే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నా వ్యాక్సిన్ కొరత వల్ల ఆ ప్రక్రియ కూడా లేట్ అవుతుంది.ఓ పక్క కరోనా వచ్చిన వారికి హాస్పిటల్స్ లో బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఇలాంటి టైం లో కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.ఒక డోస్ కూడా వేసుకోని వారు ఉండగా సెకండ్ డోస్ కోసం ఆందోళన చెందుతున్నారు.

అయితే ఫస్ట్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ కొద్దిగా లేట్ అయినా ఆదోళన అవసరం లేదని అంటున్నారు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా.

కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది ఏమి ఉండదని అంటున్నారు.

ఆలస్యమైతే వ్యాక్సిన్ పనిచేయదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.సెకండ్ డోస్ బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని గులేరియా అంటున్నారు.

ఆలస్యం అయ్యిందని సెకండ్ డోస్ వేసుకోకుండా ఉండొద్దని లేట్ అయినా సరే అది పనిచేస్తుందని అంటున్నారు.అయితే కరోనా బారిన పడి కోలుకున్న వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి వైద్య నిపుణులు మాత్రం లక్షణాలన్నీ తగ్గిన 4 నుండి 6 వారాల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెబుతున్నారు.

అంతేకాదు కరోనా కట్టడి కోసం బ్రేక్ ద చైన్ ఉద్యమం చేయాలని అన్నారు గులేరియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube