Googleలో AI ఫీచర్‌… ఇకనుండి సెర్చ్‌లో యూజర్ల ఇంటరాక్షన్ తేలిక అయిపోతుంది!

ChatGPT గురించి విన్నారు కదా.దీని మాదిరిగానే గూగుల్ కూడా త‌న సెర్చింజ‌న్‌లో AI ఫీచ‌ర్ త్వ‌ర‌లో యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Ai Feature In Google User Interaction In Search Will Be Easy From Now On-TeluguStop.com

Google CEO సుంద‌ర్ పిచ్చాయ్ డిసెంబ‌ర్ త్రైమాసిక ఆర్థిక ఫ‌లితాల వెల్ల‌డి సంద‌ర్భంగా మాట్లాడుతూ… “AI (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్) విభాగంలో మ‌నం ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాం.త్వ‌ర‌లో ఉత్త‌మ ప్రొడ‌క్ట్ కావాల్సి ఉంది” అని మాట్లాడారు.

ఇంట‌ర్నెట్ సెర్చ్‌లో తాజా లాంగ్వేజ్ మోడ‌ల్‌లో యూజ‌ర్లు నేరుగా AI చాట్‌బోట్‌తో ఇంట‌రాక్ట్ కావచ్చని కూడా ఈ సందర్భంగా అన్నారు.

Telugu Google, Latest, Ai, Sundar Pichai, Ups-Latest News - Telugu

ఇకపోతే OpenAI స్టార్ట‌ప్ నేతృత్వంలో నెటిజ‌న్ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన ChatGPTలో టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి అందరికీ తెలిసే ఉంటుంది.యూజ‌ర్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా డేటా అందిస్తున్న ChatGPT ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.దీనికి తోడు మైక్రోసాఫ్ట్ సాయంతో దూసుకెళ్తున్న ChatGPTకి పోటీగా గూగుల్ సైతం ఆంథ్రోపిక్స్ అనే స్టార్ట‌ప్ సంస్థ‌లోనూ పెట్టుబ‌డులు పెట్టినమాట వాస్తవమే.

Telugu Google, Latest, Ai, Sundar Pichai, Ups-Latest News - Telugu

ఇక గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాలు గ‌త డిసెంబ‌ర్ త్రైమాసికంలో 34 శాతం లాభాలు కోల్పోయినమాట అందరికీ విదితమే.ఈ క్రమంలో గూగుల్ పేరెంట్ సంస్థ అయినటువంటి అల్ఫాబెట్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది కూడా.ఆదాయం, లాభాల్లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో స‌ద‌రు టెక్ దిగ్గ‌జాలు పొదుపు చ‌ర్య‌ల‌లో బిజీగా వున్నాయి.ఇప్ప‌టికే భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికిన టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు ఇంకా పొదుపు చ‌ర్య‌ల‌కు గ‌ల మార్గాల‌ను అన్విషించడం కొసమెరుపు.

ఇది అదనుగా ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌ను వాయిదా వేస్తున్నాయి కూడా.అమెజాన్‌, గూగుల్ అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా.ఒక్కో సంస్థ ప‌ది వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తీసివేసిన సంగతి తెలిసినదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube