అద్బుతమైన ఐడియా : మీకు అక్కర్లేనివి ఇక్కడ వదిలేయండి, వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌  

A Humanity Thing Hyderabad Gets Wall Of Kindness-metro City,un Used Clothes And Things They Getting And Give The Poor People,wall Of Kindness

మన ఇంట్లో ఎన్నో పాత సామాన్లు, పాత డ్రస్‌లు ఇంకా ఎన్నో అవసరం రానివి, మనం ఉపయోగించనివి ఉంటాయి.వాటిని పడవేయాలంటే మనసు ఒప్పుడు, నాశనం చేయాలంటే మనసు రాదు.

A Humanity Thing Hyderabad Gets Wall Of Kindness-Metro City Un Used Clothes And Things They Getting Give The Poor People Kindness

దాంతో వాటిని అలాగే ఉంచేసుకుంటాం.అలాంటి వస్తువుల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఒక స్టాల్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ అనే పేరుతో ఒక స్వచ్చంద సంస్థ చేసిన ఈ ప్రయత్నంను అంతా గొప్పగా పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు.అవసరం లేని వస్తువులు, అక్కర్లేని వస్తువులను సేకరించడం ఆ సంస్థ పని.

A Humanity Thing Hyderabad Gets Wall Of Kindness-Metro City Un Used Clothes And Things They Getting Give The Poor People Kindness

  ఇంటింటికి వెళ్లి అలాంటి వస్తువులు సేకరించడం అనేది కష్టంతో కూడుకున్న పని.అందుకే ముఖ్య చౌరస్థాల వద్ద వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ అంటూ పెట్టి అక్కడ బాక్సులు, హ్యాంగర్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

తమకు అక్కర్లేదు అనుకున్న డ్రస్‌లను తీసుకు వచ్చి ఆ హ్యాంగర్‌కు తగిలించవచ్చు.ఇక ఏ వస్తువు అయినా అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేయవచ్చు.

ప్రతి ఒక్కరు ఇచ్చిన వస్తువులు లేదా డ్రస్‌లను అర్హులైన వారికి ఇవ్వడం ఆ సంస్థ పని.వీటికి ఆరంభంలో మంచి స్పందన వచ్చాయి.రెండు సంవత్సరాల తర్వాత కాస్త ఆధరణ దగ్గింది.

  ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లో ఉన్న ఈ స్వచ్చంద సంస్థ కైండ్‌నెస్‌ వాల్స్‌ను చిన్న నగరాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది.ఇది అద్బుతమైన ఐడియా అని దీని వల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.మీకు అక్కర్లేని వస్తువులను చెత్త కుప్పలో వదిలేసే బదలు ఎవరో ఒకరు వాటిని యూజ్‌ చేసుకునే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా దగ్గర్లో ఉండే వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ వద్ద వదిలేస్తే బాగుంటుంది.

ఇది చాలా మందికి నచ్చిన ఐడియా.కనుక ఏర్పాటు చేసిన కొత్తల ఇది చాలా వరకు వర్కౌట్‌ అయ్యింది.

  చాలా ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం సమకూరింది.ప్రస్తుతానికి వీటి పనితనం తక్కువే ఉన్నా కూడా ఇదో గొప్ప ఆలోచనగా స్వచ్చంద సంస్థపై ప్రశంసలు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ వారి ఆధ్వర్యంలోనే వాల్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్‌ రన్‌ అవుతుంది.గ్రేటర్‌ అధికారులు పెద్ద ఎత్తున గతంలో వస్తువులు మరియు డ్రస్‌లు పేదలకు, రోడ్డు పక్కన ఉండే వారికి ఇవ్వడం జరిగింది.

ఈ వాల్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్‌ అనే కార్యక్రమం అన్ని చోట్ల ఉండాలి.ఏదో మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న చిన్న గ్రామాలకు పట్టణాలకు కూడా పరిమితం అయితే అద్బుతమైన రెస్పాన్స్‌ వస్తుందని నిపుణులు అంటున్నారు.

తాజా వార్తలు

A Humanity Thing Hyderabad Gets Wall Of Kindness-metro City,un Used Clothes And Things They Getting And Give The Poor People,wall Of Kindness Related....