వైరల్‌ : కారుకు రూ.30 లక్షల ఫైన్‌, ఆ కారు ఖరీదు ఎంతో తెలుసా?

రూపాయి వస్తువుకు రెండు రూపాయల భద్రత అన్నట్లుగా ఉంది అహ్మదాబాద్‌కు చెందిన ఒక కారు యజమాని పరిస్థితి.ఆయన దాదాపు కోటి రూపాయలు పెట్టి ఒక కారును కొనుగోలు చేయడం జరిగింది.

 Ahmedabad Porsche Car Owner-TeluguStop.com

అయితే ఆ కారుకు రిజిస్ట్రేషన్‌ లేదు ఏ ఇతర డాక్యుమెంట్స్‌ లేవు.అయినా కూడా రోడ్ల మీద రయ్‌ రయ్‌ అంటూ చక్కర్లు కొడుతున్నాడు.

చాలా రోజులుగా అతడు ఆ కారులో ప్రయాణిస్తున్నాడు.కాని పోలీసులు గతంలో ఎప్పుడు పట్టుకోలేదు.

మొదటిసారి మొన్న అహ్మదాబాద్‌లో పోలీసుల జనరల్‌ చెకింగ్‌లో అతడి కారును ఆపారు.

పోలీసులు చూపించమన్న డాక్యుమెంట్స్‌లో ఏ ఒక్కటి కూడా అతడి వద్ద లేదు.

పోర్షే కంపెనీకి చెందిన ఆ కారు ఇండియన్‌ మార్కెట్‌లోకి రావాలంటే సవాలక్ష ట్యాక్స్‌లు కట్టి తీసుకు రావాల్సి ఉంటుంది.కాని అతడు మాత్రం అడ్డదారిన దాన్ని తీసుకు వచ్చాడని, అందుకే దానికి రిజిస్ట్రేషన్‌ కాని ఏ ఇతర డాక్యుమెంట్స్‌ కాని లేవని పోలీసులు గుర్తించారు.

అందుకే ఆ కారుకు మొదట 10 లక్షల రూపాయల చలానా విధిస్తూ నోటీసు ఇచ్చారు.ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఆ ఫైన్‌ను మరింత పెంచారు.

Telugu Ahmedabad, Car Paid Fine, Fine India, Telugu Ups-General-Telugu

ఆ కారుకు ఉండాల్సిన ఏ ఒక్క డాక్యుమెంట్‌ లేని కారణంగా ఏకంగా 30 లక్షల రూపాయల ఫైన్‌ను విధిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించాడు.ఆ కారును ఇప్పుడు పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.ఎప్పుడైతే ఆ ఫైన్‌ను అతడు చెల్లిస్తాడో అప్పుడు ఆ కారును విడుదల చేయడం జరుగుతుంది.ఒక వేళ కారు బయటకు వచ్చినా కూడా వెంటనే ఆ యజమాని డాక్యుమెంట్స్‌ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకు మళ్లీ పాతిక ముప్పై లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఆ కారు యజమాని ఏం చేస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇండియాలో ఒక కారుకు లేదా ఏదైనా వెయికిల్‌కు ఇంత భారీ మొత్తంలో ఫైన్‌ పడటం ఇతే ప్రథమం.దాంతో ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube